మాస్‌ సెంటర్స్‌లో ఫిదా రచ్చ

మాస్‌ సెంటర్స్‌లో ఫిదా రచ్చ

శేఖర్‌ కమ్ముల సినిమా అంటే ఏ సెంటర్స్‌ వరకే పరిమితం అనేది చాలా మంది నమ్మకం. అయితే అతని తాజా చిత్రం ఫిదా మాత్రం క్లాస్‌ సినిమా అయినప్పటికీ మాస్‌ కేంద్రాల్లోను రచ్చ లేపుతోంది. మొదటి వారాంతంలో పదిహేను కోట్ల షేర్‌ తెచ్చుకున్న ఈ చిత్రం సోమవారం ఉదయం కూడా స్ట్రాంగ్‌గా మొదలైంది.

సిటీల్లోనే కాకుండా మాస్‌ సెంటర్స్‌లో సోమవారం ఉదయం ఆట వసూళ్లు తొంభై నుంచి వంద శాతం వరకు నమోదైనట్టు రిపోర్ట్స్‌ వస్తున్నాయి. సినిమా నిలబడిపోయిందనే దానికి ఇదే సంకేతం. కాకపోతే ఏ సెంటర్స్‌కి, ఓవర్సీస్‌కి మాత్రమే పరిమితం అవుతుందేమో అనుకున్న దిల్‌ రాజు బృందానికి కూడా ఫిదా షాకిస్తోంది.

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరో కావడం వల్ల మెగా ఫాన్‌ బేస్‌ దీనికి కలిసి వస్తోందని, వరుణ్‌కి ఒక హిట్‌ పడాలనే ఫాన్స్‌ కోరిక ఫిదా తీర్చడంతో వారు దీనికి బ్రహ్మరథం పడుతున్నారని ట్రేడ్‌ చెబుతోంది. పాతిక కోట్ల షేర్‌ రాబట్టుకుంటుందని తొలి రోజు అంచనా వేసిన వాళ్లే ఈ చిత్రానికి రోజురోజుకీ పెరుగుతోన్న ఆదరణ చూసి అంతిమ వసూళ్లు ముప్పయ్‌ నుంచి ముప్పయ్‌ అయిదు కోట్ల వరకు వుండవచ్చునని అంటున్నారు. ఫ్లాపుల్లో వున్న శేఖర్‌ కమ్ముల ఒక్కసారిగా టాప్‌ లెవల్లో బౌన్స్‌ బ్యాక్‌ అయి తన సత్తా చాటుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు