‘బిగ్ బాస్’ నుంచి ఆమెను సాగనంపేశారు

‘బిగ్ బాస్’ నుంచి ఆమెను సాగనంపేశారు

మొత్తానికి సస్పెన్సుకు తెరపడింది. తెలుగు ‘బిగ్ బాస్’ నుంచి అందరికంటే ముందు ఎలిమినేట్ అయ్యిందెవరో తేలిపోయింది. చాలామంది అనుకున్నట్లే టాలీవుడ్లో వ్యాంప్ క్యారెక్టర్లకు ప్రసిద్ధి చెందిన జ్యోతి ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

తొలి వారాంతంలో రకరకాల ఈక్వేషన్ల తర్వాత చివరికి జ్యోతి.. మహేష్ కత్తి.. హరితేజలను ఎలిమినేషన్ తుది జాబితాలో చేర్చారు. ప్రేక్షకుల ఓటింగ్.. ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని జ్యోతినే ముందుగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసేశారు. తాను తొలి వారంలోనే ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని జ్యోతికి ముందే అర్థమైపోవడంతో ఆమె అంతగా ఎమోషనల్ అవ్వలేదు. జ్యోతి యాటిట్యూడ్ చూపిస్తోందని.. సరిగా పని చేయట్లేదని.. ఇంకా ఏవేవో కారణాలతో హౌస్ లో ఉన్న వాళ్లు ఆమె పట్ల వ్యతిరేకత చూపించారు.

తొలి వారంలో ఎపిసోడ్లు చూసిన జనాలకు కూడా ఆమె మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడింది. దీంతో అందరూ కలిసి జ్యోతికి ఎగ్జిట్ డోర్ చూపించేశారు. ఓ దశలో మహేష్ కత్తినే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా కనిపించాడు. ఆయన ఎలిమినేట్ అయిపోయాడని.. బట్టలు సర్దుకోమని చెప్పి ఎన్టీఆర్ ఉత్కంఠ రేపాడు. మహేష్ సూట్ కేసు పట్టుకుని హౌస్ నుంచి బయటికొచ్చేందుకు రెడీ అయిపోయాడు కూడా. కానీ ఎన్టీఆర్ బ్రేక్ వేశాడు. అది తమాషా అని చెప్పాడు.

ఇక ఆదివారం ఆఖరుకు ఎలిమినేట్ అయ్యేది జ్యోతి అని ప్రకటించారు. వీకెండ్ రెండు రోజుల్లో ఎన్టీఆర్ వ్యాఖ్యానం.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. ఎనర్జీ.. వాక్చాతుర్యం ప్రేక్షకుల్ని ఆకట్టున్నాయి. వీక్ డేస్ లో ఎపిసోడ్లతో విసుగెత్తిన ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ మళ్లీ ఉత్సాహం నింపి వెళ్లాడు. మరి రెండో వారంలో ఎపిసోడ్లు ఎలా ఉంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు