ఒకే రోజు మహేష్ డబుల్ ధమాకా

 ఒకే రోజు మహేష్ డబుల్ ధమాకా

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ ఫస్ట్ లుక్, టీజర్ కోసం అభిమానులు ఎంతగా నిరీక్షించారో తెలిసింది. ఇదిగో అదిగో అంటూ వాటి విషయంలో చాలా చాలా ఆలస్యం చేశారు. చాన్నాళ్లపాటు అభిమానుల్ని నిరీక్షించేలా చేశారు దాని మేకర్స్. ఐతే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ‘స్పైడర్’ టీంతో పాటు ‘భరత్ అను నేను’ టీం కూడా ఒకే రోజు డబుల్ ధమాకా వినోదాన్ని అందించబోతున్నట్లు సమాచారం.

ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘స్పైడర్’ సెకండ్ టీజర్ వస్తుందని అంటున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసింది స్పెషల్ టీజర్. అది సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన టీజర్ కాదు. టీజర్ కోసమే అలా ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈసారి సినిమాలోని సన్నివేశాలతో రెగ్యులర్ టీజర్ వదులుతారట. ఆగస్టులోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలయ్యే అవకాశముంది.

మరోవైపు మహేష్ కొత్త సినిమా ‘భరత్ అను నేను’ ఫస్ట్ లుక్‌ను అతడి పుట్టిన రోజుకే లాంచ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ రెండు నెలల కిందటే మొదలైంది. మహేష్ కూడా గత నెల నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో ఎన్నారై టర్న్డ్ పొలిటీషియన్ పాత్ర పోషిస్తున్నాడు. ఐతే ఆన్ లొకేషన్ ఫొటోలు చూస్తే మహేష్ లుక్కేమీ మారినట్లుగా కనిపించలేదు. మరి ఫస్ట్ లుక్‌లో మహేష్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు