వామ్మో ఈ ఏడుపులేందమ్మాయో

వామ్మో ఈ ఏడుపులేందమ్మాయో

ఆడపిల్లనమ్మా.. అంటూ చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద సందేశాన్నిచ్చే పాట పాడి అందరి దృష్టిలో పడింది సింగర్ మధుప్రియ. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ కొన్ని పాటలు పాడి చిన్నతనంలోనే మంచి పాపులారిటీ సంపాదించిందీ అమ్మాయి. బహిరంగా వేదికల్లో కానీ.. మీడియా ముందు కానీ ఏమాత్రం బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, పాటలు పాడుతూ కనిపించే ఈ అమ్మాయిని చూస్తే అందరికీ ముచ్చటేసింది. తన మీద మంచి అభిప్రాయం కలిగింది.

ఐతే టీనేజీలోనే తల్లిదండ్రుల్ని కాదని తను ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడానికి తయారైపోవడం.. పెళ్లయిన కొంత కాలానికే భర్తతో గొడవపడి మీడియా ముందుకు రావడం.. అతడి మీద తీవ్ర ఆరోపణలు చేయడం.. రెండు రోజులకే మాట మార్చేసి తన భర్త బంగారం అంటూ తల్లిదండ్రుల్ని తిట్టిపోయడం.. ఇలా ఆ మధ్య జరిగిన డ్రామాతో ఈ అమ్మాయి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఐతే ఈ మధ్యే ‘ఫిదా’లో ఓ మంచి పాట పాడి మళ్లీ వార్తల్లోకి వచ్చింది మధుప్రియ. ఇంతలోనే ‘బిగ్ బాస్’ షోకు పార్టిసిపెంట్‌గా వెళ్లడంతో ఈ అమ్మాయిపై అందరి దృష్టీ నిలిచింది. ఈ షోతో ఇంతకుముందు తన ఇమేజ్‌కు జరిగిన డ్యామేజ్‌ను సరి చేసుకుంటుందని.. జనాల దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటుందని అనుకుంటే.. ఆ హౌజ్‌లో జరుగుతున్నది వేరు.

‘బిగ్ బాస్’ హౌస్‌లో మరీ చిన్న పిల్లలాగా మధుప్రియ చేస్తున్న చేష్టలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి మధుప్రియ ఒకటే ఏడుపు. ప్రతి రోజూ ఏడుపు ముఖంతో ఆమెను చూస్తూ జనాలకు చిరాకొచ్చేస్తోంది. ఏదో ఒకట్రెండు సందర్భాల్లో ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ ప్రతి రోజూ ఏడుపులంటే జనాల ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? నా వల్ల కావట్లేదు.. నన్ను ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్‌ను అడుగుతా అంటూ బేలగా మాట్లాడుతోంది మధుప్రియ.

బిగ్ బాస్‌ ముందుకు వెళ్లినపుడు.. ‘‘నేను నీ మీద అలిగా.. నీతో మాట్లాడను’’ అంటూ చిన్న పిల్ల మాటలు మాట్లాడి చులకనైపోయింది మధుప్రియ. సోషల్ మీడియాలో మధుప్రియ తీరుపై ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. మధుప్రియ కంట్లోంచి వస్తున్న కన్నీళ్లను నింపుకోవడానికి ‘బిగ్ బాస్’ హౌస్ బయట ట్యాంకర్లు పెట్టుకున్నట్లుగా ఇమేజ్‌లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు. మొత్తంగా మధుప్రియ గురించి ఏదో అనుకుంటే.. ఆమె వ్యవహారం ఇంకేదోలా ఉంది. ఈ షో వల్ల ఆమెకు ఏమాత్రం ప్రయోజనం చేకూరుతోందో ఏమో కానీ.. జనాలకు తన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు