ఓ రేంజ్‌లో కొడతానంటున్నాడు

ఓ రేంజ్‌లో కొడతానంటున్నాడు

గోపిచంద్‌కి ఈమధ్య హిట్లు రాలేదని కాదు. లౌక్యం చిత్రంతో హిట్‌ కొట్టాడు కానీ అది కామెడీ సినిమా అయిపోయేసరికి గోపిచంద్‌ ఆశించిన బ్రేక్‌ రాలేదు. సాహసం, జిల్‌ చిత్రాలు ఫర్లేదనిపించుకున్నాయి కానీ గోపీచంద్‌ని మళ్లీ బిజీ చేయలేకపోయాయి. ఈలోగా అతనికి కాలం కలిసి రాక షూటింగ్‌ జరిగిన సినిమాలు కూడా లేట్‌ అవుతూ వచ్చాయి.

ఆరడుగుల బుల్లెట్‌ చిత్రమైతే విడుదల తేదీ ప్రకటించాక కూడా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆక్సిజన్‌ చిత్రం కూడా రిలీజ్‌కి ఇబ్బందులు పడుతోంది. అయితే తన కష్టాలన్నీ తీర్చేసే చిత్రం 'గౌతమ్‌ నంద' అవుతుందని గోపిచంద్‌ కాన్ఫిడెంట్‌గా వున్నాడు. ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ అవడంతోనే బిజినెస్‌ మొత్తం క్లోజ్‌ అయిపోయింది.

ట్రెయిలర్‌ చూసి బయ్యర్లు ఇంకా కాన్ఫిడెంట్‌గా వున్నారు. సంపత్‌ నంది డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం తన కెరియర్‌ని ట్రాక్‌ మీదకి తెస్తుందని గోపీచంద్‌ అంటున్నాడు. హీరోయిజంకి తోడు ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం కూడా ఇందులో వుందని, తప్పకుండా తన కష్టాలకి దీంతో బ్రేక్‌ పడిపోతుందని చెబుతున్నాడు. వచ్చే శుక్రవారం రిలీజ్‌ అయ్యే ఈ చిత్రం గోపీచంద్‌ గ్రాఫ్‌ ఎలా పెంచుతుందో ఏమో వేచి చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English