తరుణ్‌ రాంగ్‌ టైమ్‌లో ఇరుక్కున్నాడు

తరుణ్‌ రాంగ్‌ టైమ్‌లో ఇరుక్కున్నాడు

చాలా కాలంగా ఏమైపోయాడో కూడా తెలియని తరుణ్‌ సడన్‌గా డ్రగ్స్‌ రాకెట్‌ గోలతో న్యూస్‌లోకి వచ్చాడు. ఈ వ్యవహారంలో తరుణ్‌కి వ్యతిరేకంగా చాలా ఆధారాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అతను నడిపిన ఒక పబ్‌కి ఈ డ్రగ్స్‌ వ్యవహారం లింక్‌ వెళుతోంది. గతంలోనే పలుమార్లు తరుణ్‌ గురించి దీనిపై పుకార్లు వినిపించాయి.

ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారినపుడు కూడా తరుణ్‌ ముందుగా లిస్ట్‌లోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేయకుండా ఖాళీగా వున్న తరుణ్‌ ఈమధ్యే ఒక చిత్రంలో హీరోగా నటించాడు. ఇది నా లవ్‌స్టోరీ అంటూ తరుణ్‌ రీఎంట్రీ ఇస్తోంటే, ఇతనికి సక్సెస్‌ రావాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. ఆ సినిమా టీజర్‌కి వచ్చిన స్పందనని బట్టే తరుణ్‌పై ఎంత సాఫ్ట్‌ కార్నర్‌ వుందనేది స్పష్టమవుతోంది.

ఈ సినిమా విడుదలై వుంటే ఖచ్చితంగా యూత్‌ నుంచి స్పందన బాగుండేదేమో. కానీ ఇంతలోనే తరుణ్‌పై బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ పడిపోయింది. ఈ వ్యవహారంలో అతనికి లింక్‌ వుందని గట్టిగా వినిపిస్తోన్న నేపథ్యంలో తనకి సక్సెస్‌ లేదనే సింపతీ తగ్గిపోయి ఇదే హైలైట్‌ అవుతోంది. బ్యాడ్‌ టైమ్‌ అయిపోయిందని అనుకుంటూ వుండగానే ఇలా టైమ్‌ బ్యాడ్‌ అయి తరుణ్‌ని ఇరుకున పడేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు