టాలీవుడ్ ఫ్యాన్స్.. మరీ ఇంత అతిగానా?

టాలీవుడ్ ఫ్యాన్స్.. మరీ ఇంత అతిగానా?

దక్షిణాదిన సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేసే అభిమానులెవరూ అంటే ముందుగా అందరి దృష్టీ తమిళ ఫ్యాన్స్ మీదికే మళ్లుతుంది. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోల కోసం వాళ్లు చేసే భజన.. అవతలి హీరోలపై.. వాళ్ల అభిమానులపై విషం కక్కే తీరు మరీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా విజయ్, అజిత్ అభిమానులు ఈ విషయంలో చేసే అతి మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు వంద రోజులుండగా.. 50 రోజులుండగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి హడావుడి చేస్తుంటారు తమిళ వెర్రి అభిమానులు.

ఐతే గత కొంత కాలంగా తమిళ అభిమానుల్ని ఆదర్శంగా తీసుకుని.. అవతలి హీరోలపై విషం కక్కడం.. ట్రోలింగ్ చేయడం.. తమ అభిమాన హీరో టీజర్ లాంటి వచ్చినపుడు కంప్యూటర్లకు హారతులు పట్టడం లాంటివి చేస్తూ మన ఫ్యాన్స్ కూడా తమిళ అభిమానుల్ని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే కోవలో ఈ మధ్య ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేయడం కనిపించింది. ఓ హీరో పుట్టిన రోజుకు ఇంకా వంద రోజులు ఉండగా.. ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి రచ్చ రంబోలా చేశారు సోషల్ మీడియాలో. ఆ హీరోకు వ్యతిరేకులుగా ముద్ర పడ్డ వేరే హీరో అభిమానులు తమ హీరో పుట్టిన రోజుకు ఇంకో 50 రోజులుండగా హ్యాష్ ట్యాగ్ పెట్టి హడావుడి చేశారు. పనిలో పనిగా అవతలి హీరోలు.. అభిమానుల మీద విషం కక్కడం కూడా చేశారు. ఇంతకుముందు పద్ధతిగా ఉంటూ వచ్చిన మన ఫ్యాన్స్ కూడా ఇలా దారి తప్పుతుండటం విచారించాల్సిన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు