చరణ్‌కి హరీష్‌ శంకర్‌ కంటే అతను నచ్చాడట

చరణ్‌కి హరీష్‌ శంకర్‌ కంటే అతను నచ్చాడట

దిల్‌ రాజు బ్యానర్లో 'ఎవడు' తర్వాత మరో చిత్రం చేయడానికి చరణ్‌ కమిట్‌ అయ్యాడు. అతను ఎప్పుడు కథ తీసుకు వస్తే అప్పుడు డేట్స్‌ ఇవ్వడానికి చరణ్‌ సిద్ధంగా వున్నాడు. 'డీజే' హిట్‌ అయితే హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో చరణ్‌ చిత్రం సెట్‌ చేయాలని దిల్‌ రాజు భావించాడు.

పవన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌ తర్వాత మరో మెగా హీరోతో సినిమా అంటే క్రేజ్‌ వుంటుందని భావించాడు. అయితే 'డీజే' చూసిన తర్వాత హరీష్‌తో పని చేయడం పట్ల చరణ్‌ అంత ఆసక్తిగా లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రొటీన్‌ సినిమాలు చేయడానికి అయిష్టంగా వున్న చరణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా వుండే సినిమాలైతే చేస్తానంటున్నాడు. హరీష్‌ శంకర్‌ 'గబ్బర్‌సింగ్‌' తర్వాత మళ్లీ అలా ఇంప్రెస్‌ చేయకపోవడంతో చరణ్‌ ఆసక్తిగా లేడట.

అదే సమయంలో 'నేను లోకల్‌' చూసి చరణ్‌ బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. త్రినాధరావు నక్కిన కనుక తనకి నచ్చే కథ తెస్తే చేస్తానని దిల్‌ రాజుకి చెప్పాడట. సినిమా చూపిస్త మావా, నేను లోకల్‌తో వరుస హిట్లు కొట్టిన త్రినాధరావుతో దిల్‌ రాజు ఒక మీడియం రేంజ్‌ హీరోతో సినిమా ప్లాన్‌ చేద్దామని అనుకున్నాడు. చరణ్‌నుంచి అనుకోని ప్రపోజల్‌ రావడంతో ఇప్పుడు దాని మీద కసరత్తు మొదలు పెట్టించాడు. మరి హరీష్‌ శంకర్‌కి ఏ హీరో దొరుకుతాడనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు