ఇప్పుడు చూడండి కమ్ముల దమ్మేంటో..

ఇప్పుడు చూడండి కమ్ముల దమ్మేంటో..

తెలుగు ప్రేక్షకులందు.. ఓవర్సీస్ ఆడియన్స్ టేస్టు వేరని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలు అక్కడ ఆడవు. ఇక్కడ పెద్దగా ఆడని సినిమాలు అక్కడ అదరగొట్టేస్తుంటాయి. వాళ్ల టేస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. అక్కడి వాళ్లకు హీరో స్టార్ ఇమేజ్‌తో పెద్దగా సంబంధం ఉండదు. కమర్షియల్ టచ్ ఉన్న మాస్ మసాలా సినిమాల్ని అక్కడి వాళ్లు పెద్దగా ఆదరించారు. వాళ్లు క్లాస్ లవ్ స్టోరీలు.. ఎంటర్టైనర్లు.. థ్రిల్లర్లను బాగా ఇష్టపడతారు. ఈ మధ్యే అల్లు అర్జున్ సినిమా ‘డీజే’ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తే.. అమెరికాలో చతికిలబడింది. నాని సినిమా ‘నిన్ను కోరి’ మాత్రం అక్కడ అదరగొట్టేసి.. 1.2 మిలియన్ మార్కుకు చేరువగా ఉంది.

ఇక ఈ శుక్రవారం విడుదలైన ‘ఫిదా’ కూడా అమెరికన్ తెలుగు ఆడియన్స్‌‌కు బాగా నచ్చే సినిమానే. ఈ చిత్రాన్ని అక్కడ పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. ప్రిమియర్స్‌తో పాటు తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. ‘నిన్ను కోరి’ కంటే కూడా ‘ఫిదా’ అక్కడి ప్రేక్షకులకు మరింతగా కనెక్టయ్యే అవకాశముంది. నిజానికి శేఖర్ కమ్ముల శైలి సినిమాలు యుఎస్ ఆడియన్స్‌కు చక్కగా సరిపోతాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ సినిమాలు వాళ్ల టేస్టుకు పర్ఫెక్ట్‌గా సూటయ్యే సినిమాలు. కాకపోతే ఆ సినిమాలు రిలీజయ్యే సమయానికి ఓవర్సీస్ మార్కెట్ క్రియేటవ్వలేదు. మార్కెట్ వచ్చాక కమ్ముల తీసిన సినిమాలు తక్కువ.

అవి కూడా ఫెయిల్యూర్లు. ఐతే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ బాగా ఊపందుకున్న సమయంలో ‘ఫిదా’ లాంటి క్లాస్ లవ్ స్టోరీతో మెప్పించాడు కమ్ముల. ఈ చిత్రానికి చాలా మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. వచ్చే వారం రాబోయే ‘గౌతమ్ నంద’ మాస్ సినిమా.. ఆ తర్వాతి వారంలోనుూ పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ వరకు ‘ఫిదా’ యుఎస్‌లో దున్నుకోవడానికి అవకాశముంది. కాబట్టి కమ్ముల నేరుగా మిలియన్ క్లబ్బులోకి దూకేయడం గ్యారెంటీ ఏమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు