గౌతమ్ నంద.. భలే ఛాన్సులే

గౌతమ్ నంద.. భలే ఛాన్సులే

ఈ నెలాఖర్లో సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకుందామని చూశాడు గోపీచంద్. అందుకే ఆచితూచి తన కొత్త సినిమా 'గౌతమ్ నంద'ను ఈ నెల 28కి ఫిక్స్ చేశాడు. కానీ అదే తేదీకి అనుకోకుండా 'నక్షత్రం' కూడా వచ్చి పడింది. మరోవైపు ధనుష్ సినిమా 'రఘువరన్ బీటెక్' సీక్వెల్ 'వీఐపీ-2'ను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాలని భావించడంతో 'గౌతమ్ నంద'కు గట్టి పోటీ తప్పదని అనుకున్నారు. గోపీచంద్ కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా వసూళ్లపై మిగతా సినిమాలు ప్రభావం చూపుతాయేమో అని సందేహాలు వ్యక్తం చేశారు. ఐతే గోపీ సినిమాకు కాలం కలిసొచ్చి.. సోలో రిలీజ్‌కు మార్గం సుగమం అయింది.

28న అనుకున్న 'నక్షత్రం' సినిమా ఆగస్టు 4కు వాయిదా పడింది. ఆ రోజుకు రావాల్సిన రానా సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' ఆగస్టు 11కు వాయిదా పడటం వల్లో ఏమో 'నక్షత్రం' సినిమాను వాయిదా వేసేశారు. మరోవైపు 'వీఐపీ-2' సినిమా తమిళంలోనే ఆగస్టుకు వాయిదా పడిపోయింది. దీంతో 'గౌతమ్ నంద'ఖు లైన్ క్లియరైంది. ఈ సినిమాపై నిర్మాతలు భారీ పెట్టుబడి పెట్టారు.
బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే జరిగింది. గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తే తప్ప ఈ సినిమా సేఫ్ జోన్లోకి రాదు. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ అనేది ఈ మూవీ మేకర్స్‌తో పాటు బయ్యర్లకు గొప్ప ఊరటనిచ్చేదే. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ థ్రెసా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English