సిగ‌రెట్ అల‌వాటే లేదు...సిట్ తో నాయుడు

సిగ‌రెట్ అల‌వాటే లేదు...సిట్ తో నాయుడు

టాలీవుడ్ ను కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ రాకెట్ విచార‌ణ రెండో రోజు కొన‌సాగింది. మొద‌టి రోజు  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ను సిట్ అధికారులు విచారించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా రెండో రోజు కెమెరామెన్‌ శ్యామ్ .కె.నాయుడును సిట్‌ అధికారులు ప్ర‌శ్నించారు. ఈ రోజు ఉదయం తన న్యాయవాది, కొద్దిమంది సన్నిహితులతో కలిసి శ్యామ్‌. కె.నాయుడు విచార‌ణకు హాజ‌ర‌య్యారు. అయితే తనకు సిగరెట్‌ అలవాటు కూడా లేదని, కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని ఆయన సిట్‌ విచారణలో తెలిపినట్లు సమాచారం.

ఉదయం 10.30 గంటల నుంచి అనేక దఫాలుగా శ్యామ్ .కె.నాయుడును సిట్ అధికారులు విచారించారు. సుమారు ఐదున్నర గంటల పాటు విచార‌ణ‌  సాగింది. కెల్విన్‌తో శ్యామ్‌. కె. నాయుడుకు ఉన్న‌సంబంధాలపై సిట్‌ ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. కెల్విన్‌ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? వ‌ంటి ప్రశ్న‌లను సిట్ అడిగినట్టు తెలుస్తోంది. అయితే, షూటింగ్ ల నిమిత్తం తాను ప‌బ్ ల‌కు వెళ్తుంటాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

విచారణకు శ్యామ్ .కె . నాయుడు సహకరించినట్లు ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్ తెలిపారు. డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయ‌న తెలిపారు. నోటీసులు అందుకున్నవారు దర్యాప్తుకు సహకరిస్తే త్వ‌ర‌గా విచారణ పూర్తి చేస్తామన్నారు. రేపు ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు విచార‌ణకు హాజ‌రు కానున్నారు. నిన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు, విదేశాల నుంచి హైద‌రాబాద్ కు కొన్ని కొరియ‌ర్ సంస్థ‌ల ద్వారా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అయిన‌ట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో సిట్ అధికారులు ఈ రోజు మూడు కొరియర్‌ సంస్థలతో సమావేశ‌మ‌య్యారు. డీహెచ్‌ఎల్‌, బ్లూ డాట్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇతర దేశాల నుంచి  కొరియర్‌ ద్వారా హైద‌రాబాద్ కు డ్రగ్స్‌ వస్తున్నట్లు మొద‌టి నుంచి వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English