చిరంజీవి 'గుంపులో గోవిందా' అవుతాడా?

చిరంజీవి 'గుంపులో గోవిందా' అవుతాడా?

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం చాలా టైమ్‌ తీసుకుంటోన్న చిరంజీవి ఇక పనులు వేగవంతం చేస్తే మంచిది. బాహుబలి ఎఫెక్ట్‌ వల్ల ఈ తరహా చిత్రాల రూపకల్పనకి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ నుంచి అలాంటి సినిమాల నిర్మాణం జోరందుకుంది. మణికర్నిక, పద్మావతి చిత్రాలతో పాటు థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ అనే భారీ చిత్రం కూడా తెరకెక్కనుంది.

తాజాగా అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా అలాంటి సినిమానే మొదలు పెట్టాడు. ఛత్రపతి శివాజీ వెంట వుండి పోరాడిన ఒక గొప్ప యోధుడు తానాజీ కథతో అజయ్‌ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. తెలుగు చిత్ర సీమనుంచి ఎవరూ బాహుబలిని స్ఫూర్తిగా తీసుకోకపోయినా బాలీవుడ్‌ మాత్రం అలాంటి చిత్రాలు పెద్ద స్థాయిలో రూపొందించడంలో బిజీ అయింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో బాలీవుడ్‌ మార్కెట్‌ కూడా టార్గెట్‌ చేస్తోన్న చిరంజీవి బృందం తొందర పడాలి. ఆలస్యం చేస్తే ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత రిలీజ్‌ అయితే గుంపులో గోవిందా తరహాలో చిరంజీవిని పట్టించుకునే అవకాశం వుండదు. మిగతా చిత్రాలు రాకముందే ఈ చిత్రం వచ్చేట్టుగా ప్లాన్‌ చేసుకోకపోతే వేసుకున్న ప్లాన్‌ వర్కవుట్‌ అవ్వకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు