గాసిప్‌: ఆమెతో అఖిల్‌ కొనిపించాడట!

గాసిప్‌: ఆమెతో అఖిల్‌ కొనిపించాడట!

అఖిల్‌లో తనతో పాటే తెరంగేట్రం చేసిన సయేషా సైగల్‌ సక్సెస్‌ కావాలని అఖిల్‌ అక్కినేని బాగా కోరుకుంటూ వుంటాడు. సయేషాకి కొత్త సినిమాల్లో అవకాశాలొచ్చినపుడు ఆమెని సోషల్‌ మీడియా ద్వారా ఎంకరేజ్‌ చేస్తుంటాడు.

ఆమె  ప్రతిభని కీర్తిస్తూ తన సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. తొలి హీరోయిన్‌తో స్నేహ సంబంధాలున్న అఖిల్‌ ఆమె సక్సెస్‌ అవడం కోసం చిన్న సెంటిమెంటల్‌ టచ్‌ ఇచ్చాడని భోగట్టా. హైదరాబాద్‌లో సమంత నివాసమున్న ఫ్లాట్‌ని సయేషా తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదగడానికి ఆ ఫ్లాట్‌ బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్‌ వుండడంతో సయేషాకి కూడా లక్‌ కలిసి వస్తుందని ఆ ఫ్లాట్‌ ఆమెకే ఇప్పించాడట.

తప్పకుండా సుడి తిరుగుతుందంటూ కన్విన్స్‌ చేసి ఆమెని అందులోకి పంపించాడట. మరి నిజంగా సయేషా ఈ ఫ్లాట్‌ వల్ల సమంత అయిపోతుందో లేదో కానీ తన ఫస్ట్‌ హీరోయిన్‌ స్టార్‌గా ఎదగాలని కోరుకుంటోన్న అఖిల్‌ కొత్త గాసిప్స్‌కి తెర లేపుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English