ప్రేమ పోయి పెళ్లి వచ్చే ఢామ్ ఢామ్!

 ప్రేమ పోయి పెళ్లి వచ్చే ఢామ్ ఢామ్!

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ మంచి మార్కెట్ ని సంపాదించుకున్న తమిళ కథానాయకుడు కార్తి.  తాను తమిళంలో తీసే ప్రతీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. `యుగానికి ఒక్కడు`, `ఆవారా`, `నా పేరు శివ` తదితర చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. తాజాగా తమిళంలో `ఆల్ ఇన్ ఆల్ అళగురాజా` అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్, రాధికా ఆప్టే కథానాయికలు. ఈ చిత్రం తెలుగులో `ప్రేమ పోయి పెళ్లి వచ్చే ఢామ్ ఢామ్` అనే పేరుతో విడుదల కాబోతోంది.

సున్నితమైన కథలతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రాలను రూపొందిస్తుంటాడు రాజేష్. ఆయన తీసిన `ఓకే ఓకే` చిత్రం తెలుగులోనూ చక్కటి ఆదరణ పొందింది. `ప్రేమ పోయి పెళ్లి వచ్చే ఢామ్ ఢామ్` సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో కార్తి, రాధికా అప్టేలపై 1980ల నాటి సినిమాలను పోలిఉండే ఓ గీతాన్ని తెరకెక్కించారు. ఆ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. `శకుని` చిత్రంతో పరాజయాన్ని చవిచూసిన కార్తికి ఈ చిత్రమైనా ఫలితాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు