తెలుగు సినీ పరిశ్రమ సూపరండీ

తెలుగు సినీ పరిశ్రమ సూపరండీ

ఈమధ్య హీరోయిన్లు మన దర్శకుల పని తీరు మీద, ఇక్కడ వున్న మేల్‌ వర్షిప్‌ మీద, కాస్టింగ్‌ కౌచ్‌ పట్ల చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇవి చాలదన్నట్టు తాజాగా డ్రగ్స్‌ స్కాండల్‌లోను టాలీవుడ్‌ ఇన్‌వాల్వ్‌ అయిందనే చెడ్డపేరు బాగా వచ్చింది. అన్ని రకాలుగా అందరూ తెలుగు సినిమాని ఆడిపోసుకుంటోన్న టైమ్‌లో మనకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడానికి, మిగతా పరిశ్రమలకంటే మనది బెస్ట్‌ అని చెప్పడానికి నిత్య మీనన్‌ ముందుకొచ్చింది.

దక్షిణాదిలో అన్ని భాషల చిత్రాల్లోను నటించిన నిత్యామీనన్‌ కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడంలో, ఆడవాళ్లని మర్యాదగా చూసుకోవడంలో తెలుగు సినిమా బెస్ట్‌ అని సర్టిఫై చేసింది. మిగతా ఎవరు ఈ మాట చెప్పినా ముఖస్తుతి కోసమో, అవకాశాల కోసమో చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ ముక్కుసూటిగా మాట్లాడ్డానికి ఏమాత్రం జంకని నిత్యా మీనన్‌ తెలుగు సినిమాకి టాప్‌ రేటింగ్‌ ఇచ్చింది.

తన సొంత మలయాళ చిత్ర సీమని కూడా ఆమెని వెనక్కి నెట్టింది. ఇప్పుడు నిత్యకి తెలుగులో ఆఫర్లు కూడా పెద్దగా లేవు కనుక ఇప్పుడు ఆమె ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. దీనిని బట్టి జెన్యూన్‌గానే ఆమెకి తెలుగు సినిమా బెస్ట్‌ అనిపించిందనేది క్లియర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు