`రుద్రమదేవి`లో ఆ ఇద్దరూ!

`రుద్రమదేవి`లో ఆ ఇద్దరూ!

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రుద్రమదేవి` తారాబలంతో కళకళలాడుతోంది. ప్రత్యేక ఆకర్షణ అన్నట్టుగా రోజుకో కొత్త తార పేరును వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులతో ఫుల్ ప్యాక్డ్ అన్నట్టున్న ఈ సినిమాకి తాజాగా మరో ఇద్దరు అందాల భామలు తోడయ్యారు. వాళ్ళే... కేథరిన్, నిత్యమీనన్. అనుష్కకి తోడైన ఆ ఇద్దరిపై ఇటీవలే ఓ గీతాన్ని తెరకెక్కించినట్టు సమాచారం.

కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో గోనగన్నారెడ్డి పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్రలో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తున్నట్టు సమాచారం. గన్నారెడ్డి ప్రియురాలిగా కేథరిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.  నిత్యమీనన్ మరో కీలక పాత్రని పోషిస్తోందని చిత్ర బృందం చెబుతోంది.  రానా, అనుష్క కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. త్రీడీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. 50కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు