ప్రభాస్‌కి ఫీలర్లు పంపిస్తోన్న తమన్నా

ప్రభాస్‌కి ఫీలర్లు పంపిస్తోన్న తమన్నా

'బాహుబలి' చిత్రంలో నటించిన అనుష్కనే 'సాహో'కి కూడా ప్రభాస్‌ రిపీట్‌ చేస్తున్నాడని తెలిసి, తనకి కూడా అవకాశం ఇస్తాడేమోనని తమన్నా ఆశ పడుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్లు దొరక్కపోవడంతో, అనుష్కకి బాహుబలి వల్ల హిందీలో క్రేజ్‌ రావడంతో ఆమెని పెట్టుకుంటున్నారని తెలిసి, తనకి బాలీవుడ్‌లో అంతకంటే ఎక్కువ పరపతి, గుర్తింపు వున్నాయని తమన్నా ఒక రాయేసి చూస్తోంది.

రెబల్‌, బాహుబలి చిత్రాల్లో ప్రభాస్‌తో నటించిన తమన్నాకి అతనితో సన్నిహిత సంబంధాలే వున్నాయి. ఈమధ్య కాలంలో తమన్నాకి ఏదీ కలిసి రావడం లేదు.

బాహుబలి 2 క్రెడిట్‌ కూడా అందరూ పట్టుకుపోయి తనని కరివేపాకులా తీసేసారు. ప్రభాస్‌కి ఫీలర్లు పంపిస్తోన్న తమన్నాని యువి క్రియేషన్స్‌ వారు కన్సిడర్‌ చేస్తారో లేదో చూడాలి.

ఈ సినిమా మిస్‌ అయినా ప్రభాస్‌ ఇకపై చేసే సినిమాలన్నీ హిందీలోను రిలీజ్‌ అవుతాయి కనుక ఎప్పటికైనా ఇంకో ఛాన్స్‌ వస్తుందని తమన్నా ఆశిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English