గాసిప్‌: ఆమె కావాలని నాని పట్టు!

గాసిప్‌: ఆమె కావాలని నాని పట్టు!

ఒక రెండు సినిమాల్లో నటీనటులు కలిసి నటించారంటే ఇక వారి మధ్య ఏదో వుందనే పుకారు స్టార్ట్‌ అయిపోతుంది. జెంటిల్‌మేన్‌ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన నివేదిత థామస్‌కి మంచి పేరొచ్చింది. రెండవ సినిమా కూడా నానితోనే సైన్‌ చేసింది. 'నిన్ను కోరి' చిత్రంలో నివేదిత అయితే బాగుంటుందని నానినే సూచించాడని ఆమధ్య బాగా వినిపించింది.

దాంతో పాటు ఎన్టీఆర్‌ సినిమా 'జై లవకుశ'లోను ఆమె అవకాశం సాధించింది. అయితే మొదటి రెండు సినిమాలు నానితోనే కావడం, అవి రెండూ హిట్టవడంతో ఇప్పుడు తమది హిట్‌ పెయిర్‌ అయిపోయింది. దీంతో నాని మరోసారి ఆమెని రిపీట్‌ చేయాలని అనుకుంటున్నట్టు భోగట్టా.

ఎంసిఏ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేసే చిత్రంలో నివేదితని తీసుకోమని నాని సిఫార్సు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రైజ్‌లో వున్న హీరో కావడంతో అతని డిమాండ్లకి నిర్మాతలు ఈజీగా తలొగ్గుతారు.

నాని కోరి పెట్టుకుంటున్నాడో లేక హిట్‌ పెయిర్‌ అనేసి నిర్మాతలే రిపీట్‌ చేస్తున్నారో కానీ దీని వల్ల గాసిప్‌ సర్కిల్స్‌కి మంచి మేత దొరికేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు