ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్స్

ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్స్

ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరు? ఇండియాలో ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మహాత్మాగాంధీ అని ఠక్కున చెప్తారు. దాదాపుగా ప్రతి దేశమూ తమ దేశాన్ని ఉద్ధరించిన మహానుభావులను ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటూ గౌరవిస్తాయి. అలాగే వివిధ రంగాల్లోనే ఫాదర్స్ గా పేరొందిన ప్రఖ్యాత వ్యక్తులున్నారు. ఫాదర్ ఆఫ్ ద ఫిజిక్సు అంటే ఐన్ స్టీన్.. ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఆరిస్టాటిల్... ఇలా ఎందరికో బిరుదులు, గౌరవం దక్కాయి. తాజాగా ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా విపక్ష ఎమ్మెల్యే రోజా ఇలాంటి బిరుదే ఇచ్చారు. కానీ... ఆ రంగం ప్రకారం చూసుకుంటే ఫాదర్ అన్నందుకు గౌరవం దక్కిందని సంబరపడాలో.. లేదంటే ఆ రంగాన్ని బట్టి ఏడవాలో తెలియని స్థితి చంద్రబాబుది. ఎందుకంటే... రోజా చెప్పిన ఫీల్డు అలాంటిది. అవును.. రోజా చంద్రబాబును ‘‘ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్స్’’గా అభివర్ణించారు. అది విన్నవారంతా రోజా చమత్కారానికి ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై రోజా మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ఏదో ఘ‌న‌కార్యం చేస్తున్న‌ట్లు ఐదు సంత‌కాలు పెట్టార‌ని... 2014 జూన్‌లోనే బెల్టు షాపులు ఉండ‌నివ్వ‌మ‌ని సంత‌కం పెట్టిన చంద్ర‌బాబు ఇన్నేళ్ల‌యినా వాటిని అరిక‌ట్ట‌లేక‌పోయారే ఆమె అన్నారు.  చంద్ర‌బాబుని ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.

ఏపీలో మ‌హిళ‌లు పోరాటం చేస్తున్నందుకు మ‌ళ్లీ ఇప్పుడు నెల‌రోజుల్లో బెల్టు షాపుల‌ను బాబు అరిక‌డ‌తామ‌ని మాట్లాడుతున్నార‌ని రోజా విమ‌ర్శించారు. సంత‌కం పెట్టిన క్ష‌ణం నుంచి అమ‌ల్లోకి రావాల్సిన అంశాలు ఇప్ప‌టికీ పూర్తి కావ‌డం లేద‌ని ఆమె మండిప‌డ్డారు. ఇదంతా ఎలా ఉన్నా ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్స్ అన్న కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు