మురుగ దర్శకత్వంలో చరణ్?

మురుగ దర్శకత్వంలో చరణ్?

రామ్ చరణ్ మళ్ళీ వేగం పెంచాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన చరణ్ తాజాగా మరో ప్రాజెక్టుకు సైతం  పచ్చ జెండా ఊపాడు. ఆ నయా చిత్రం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. `గజని` సినిమాతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు అందరినీ అలరించిన ఈ దర్శకుడు రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేసి పెట్టుకున్నారట. ఆ కథను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా.. అందుకు తగిన సమయమే దొరకడం లేదట.

మురుగదాస్ కి, మెగా కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. `గజని` తెలుగు, హిందీ వెర్షన్ తీసిన నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆ అనుబంధంతోనే గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా చేస్తానని మురుగదాస్ మాటిచ్చారట. ఆ సినిమా చరణ్ కథనయకుదిగానే ఉండబోతోందట. మురుగదాస్, చరణ్ కలిసి సినిమా చేయడానికి సరైన సమయం ఇదే అని మెగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అందుకే మురుగదాస్ త్వరత్వరగా తన సినిమాని పూర్తి చేసుకుని చరణ్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు రాబోతున్నారట. వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English