టాలీవుడ్‌లో మందుకి పెరిగిన గిరాకీ

టాలీవుడ్‌లో మందుకి పెరిగిన గిరాకీ

డ్రగ్స్‌ గోలతో ఒకవైపు పోలీసులు భయపెడుతూ వుంటే, మరోవైపు మీడియా దొరికిందే సందు అంటూ సినిమా వాళ్లని చెడుగా చిత్రీకరించేస్తోంది. దీంతో మాదకద్రవ్యాలకి అలవాటు పడ్డ జనం కూడా ప్రస్తుతం వాటికి దూరంగా వుంటున్నారట.

ఎప్పుడు ఎవరు విచారణకి పిలుస్తారో తెలియదు కనుక బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్స్‌ జాడ కూడా దొరక్కుండా చూసుకుంటున్నారట. అయితే మత్తుకి అలవాటు పడ్డ వాళ్లు దానికి పూర్తిగా దూరంగా వుండలేరు కనుక ప్రస్తుతం మద్యానికి డిమాండ్‌ బాగా పెరిగిందని, అలవాటున్న వారంతా భారీగా స్టాక్‌ పెట్టుకుంటున్నారని టాక్‌ వినిపిస్తోంది.

తరచుగా పార్టీలు చేసుకునే కుర్రోళ్లు కూడా ప్రస్తుతం వాటికి దూరంగా వుంటున్నారని, ఇండస్ట్రీకి చెందిన కుర్రాళ్లపై తండ్రుల ఒత్తిడి బాగా వుందని, రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే కెరియర్‌ నాశనం అయిపోతుంది కనుక అందరూ అలర్ట్‌ అయిపోయి జాగ్రత్త పడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.

ఈ వ్యవహారం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది తెలియకపోవడంతో కొద్ది నెలల పాటు మాదకద్రవ్యాల జోలికి ఎవరూ పోకపోవచ్చు. ఆల్రెడీ పేర్లు బయటకి వచ్చిన వారయితే మద్యం సేవించడానికి కూడా జంకుతుండవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు