ఆ సెటైర్లు శ్రుతి హాసన్ మీదేనా?

ఆ సెటైర్లు శ్రుతి హాసన్ మీదేనా?

‘బాహుబలి’కి దీటైన సినిమా అవుతుందని తమిళ జనాలు ఆశిస్తున్న సినిమా ‘సంఘమిత్ర’. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు. ఐతే ఈ చిత్రం కోసం అతను ఆశించిన హీరోలు దొరకలేదు. చివరికి జయం రవి, ఆర్యలతో సర్దుకుపోయాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను తీసుకుంటే.. ఆమె కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం సాధన చేసి, కేన్స్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో హడావుడి చేసి.. చివరికి హఠాత్తుగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఐతే తర్వాత సైలెంటుగా ఉండకుండా.. ఈ సినిమా స్క్రిప్టు ఇంకా రెడీ కాలేదని, డేట్ క్యాలెండర్ సరిగా లేదని విమర్శలు గుప్పించింది.

దీనిపై కొంచెం లేటుగా సుందర్ భార్య ఖుష్బు ఘాటైన సమాధానం ఇచ్చింది. శ్రుతి హాసన్ పేరెత్తకుండా ఆమెపై సెటైర్లు గుప్పించింది. ‘సంఘమిత్ర’ స్క్రిప్టు రెడీ కాలేదన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేసింది. ‘‘సంఘమిత్ర ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటి. ఇలాంటి సినిమాలు సరైన ప్లానింగ్ లేకుండా చేయడం కుదరదు. సంఘమిత్ర స్క్రిప్టు రెడీ కాలేదని కొందరు చేస్తున్న కామెంట్లు చూశాను. ఈ సినిమా కోసం గత రెండేళ్ల నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి చిత్రాల షూటింగుకి 30 శాతం సమయం పడితే.. షూటింగ్ చేయడానికంటే ముందు 70 శాతం సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

మీ వైపు నుంచి ఉన్న లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలి వాళ్లపై నిందలేయడం ఎంత వరకు సమంజసం. ఒకరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ల నుంచి ఇంకా ఎక్కువ ప్రొఫెషనలిజాన్ని కోరుకుంటాం. మీ తప్పుల్ని అంగీకరించడం మొదలుపెడితే మంచి స్థాయికి వెళ్తారు’’ అని ఖుష్బు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కౌంటర్లు శ్రుతి హాసన్‌కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English