నారా బాబు అవతారంపై సుధీర్ బాబు కామెంట్

నారా బాబు అవతారంపై సుధీర్ బాబు కామెంట్

హీరో అన్నాక కొంచెం ఫిజిక్ మెయింటైన్ చేయాలి. ఫిట్‌గా కనిపించాలి. అందులోనూ తరచుగా పోలీసు క్యారెక్టర్లు వేస్తున్న హీరో మరింత అప్రమత్తగా ఉండాలి. ఆ పాత్రలకు తగ్గట్లుగా కనిపించాలి. కానీ నారా రోహిత్ మాత్రం అదేం పట్టించుకోలేదు. మొదట్నుంచే కొంచెం బొద్దుగా ఉన్న అతను.. తర్వాత మరింత లావయ్యాడు. చూడ్డానికి ఎబ్బెట్టుగా తయారయ్యాడు.
అందులోనూ ఆ అవతారంలో పోలీస్ క్యారెక్టర్లు.. బాక్సర్ పాత్ర వేసేసరికి అతడిపై చాలా సెటైర్లు పడ్డాయి. ఇండస్ట్రీ జనాలు కూడా అతడి గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఐతే ఎట్టకేలకు రోహిత్‌లో ఈ ఏడాది మార్పు వచ్చింది. కష్టపడి అవతారం మార్చుకున్నాడు. ఒకప్పటి రోహిత్ అవతారం చూసి తాను ఏమనుకున్నానో అతడితో కలిసి ‘శమంతకమణి’లో నటించిన హీరో సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘రోహిత్‌కు నాకు చాలా పోలికలుంటాయి. అతను నాకు అద్దం లాంటి వాడు. మేమిద్దరం తక్కువ మాట్లాడతాం. మేం పక్కనోళ్లు మాట్లాడేది ఎక్కువ వింటాం. రోహిత్ మంచి కుక్. భోజన ప్రియుడు. ఈ మధ్య అతను దాదాపు 21 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు అతడి లుక్ చూస్తే అదోలా ఉండేది. ‘మంచి కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. ఎందుకు బాడీ మీద ఫోకస్‌ చేయడం లేదు’ అనిపించేది.

రోహిత్‌ను చాలా సార్లు నేరుగానే కోప్పడేవాడిని. కానీ ఇప్పుడు 21కిలోలు తగ్గాడని తెలిసి చాలా సంతోషం కలిగింది. మామూలుగా అందరూ నన్ను ఫిట్‌ అంటారు. కానీ నేను ఐదారు కిలోలు తగ్గాలంటే చాలా కష్టం. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ కోసం బరువు తగ్గాల్సి ఉంది. అది నాకు చాలా టఫ్‌ టాస్క్‌’’ అని సుధీర్ బాబు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు