క్లీవేజ్ షోలతో రచ్చో రచ్చస్య...

క్లీవేజ్ షోలతో రచ్చో రచ్చస్య...

కొందరు హీరోయిన్లు సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించి.. బయట కొంచెం పద్ధతిగా దర్శనమిస్తుంటారు. ఇంకొందరేమో తెరమీద కొంచెం పద్ధతిగా కనిపించి.. బయట మాత్రం రెచ్చిపోతుంటారు. బాలీవుడ్ భామ దిశా పటాని రెండో కోవకే చెందుతుంది. హిందీలో ఆమె చేసిన ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో తెలిసిందే.

తెలుగులో చేసిన ‘లోఫర్’లో కూడా మరీ అంగాంగ ప్రదర్శన చేసిందేమీ లేదు. కానీ బయట మాత్రం ఏ ఫొటో షూట్ చేసినా.. ఏ అవార్డుల వేడుకలో పాల్గొన్న అమ్మడి హొయలు మామూలుగా ఉండదు. క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది ఈ స్లిమ్ బ్యూటీ. గతంలో ఎన్నోసార్లు క్లీవేజ్ షోల విషయంలో హద్దులు దాటిన దిశా.. తాజాగా న్యూయార్క్‌లో జరుగుతున్న ఐఫా వేడుకల్లో డోస్ మరింత పెంచేసింది.

అక్కడికి చాలామంది ప్రముఖ బాలీవుడ్ భామలు వచ్చినా.. అందర్లోకి ఎక్కువ హైలైట్ అయింది దిశానే. అందుకు ఆమె చేసిన గ్లామర్ షోనే కారణమని ఈ ఫొటో చూస్తేనే అర్థమైపోతుంది. తెరమీద ఎంత సెక్సీగా కనిపించడానికైనా తనకు అభ్యంతరాలు లేవని దిశా చెప్పకనే చెబుతున్నా.. ఆమెను బాలీవుడ్ వాళ్లు సరిగా ఉపయోగించుకోవట్లేదెందుకో మరి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు