హ‌ర్ట్ చేయ‌లేదు.. జ‌స్ట్ జోక్ చేసింద‌ట‌

హ‌ర్ట్ చేయ‌లేదు.. జ‌స్ట్ జోక్ చేసింద‌ట‌

ఇద్ద‌రే ఉన్న‌ప్పుడు ఏం మాట్లాడుకున్నా ఫ‌ర్లేదు. స‌న్నిహితుల వ‌ద్ద మాట్లాడిన మాట‌ల‌కు ఓకే. కానీ.. ప‌బ్లిక్ లో ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ ఫిగ‌ర్లు మాట్లాడే ప్ర‌తి మాటా రికార్డు అవుతుంద‌న్న విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు ప్ర‌ముఖులు. తాము స‌ర‌దాగా మాట్లాడినా.. ఆ విష‌యం అంద‌రికి అర్థ‌మ‌య్యేలా ఉండాలే కానీ.. త‌మ‌కు మాత్ర‌మే తెలిసేలా ఉంటే ఎంత ఇబ్బంద‌న్న విష‌యం తాజాగా న‌టి తాప్సీకి బాగానే అర్థ‌మై ఉంటుంది.

ప‌బ్లిక్ షోలో మాట్లాడుతున్న‌ప్పుడు.. అందునా ఎవ‌రి మీద‌నైనా ఎట‌కారం చేసుకునేట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాలే కానీ తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. అదే జ‌రిగితే మ‌హా ఇబ్బంది. ఇటీవ‌ల ఒక షోకు హాజ‌రైన తాప్సీ త‌న‌ను తొలిసారి చిత్ర‌రంగానికి ప‌రిచ‌యం చేసిన కె. రాఘ‌వేంద్ర‌రావుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసింద‌న్న వివాదంలోకి చిక్కుకోంది. రాఘ‌వేంద్రరావు త‌న సినిమాల్లో హీరోయిన్ న‌డుము మీద పండ్లు... పువ్వులు వేయిస్తుంటార‌ని.. అందులో ఉద్దేశం ఏంటో త‌న‌కు ఎంత‌కూ అర్థంకాద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

అందునా.. త‌న‌ను ప‌రిచ‌యం చేసిన సినిమాలో అయితే.. త‌న న‌డుము మీద కొబ్బ‌రికాయ‌ను వేశార‌ని.. టెంకాయతో రొమాంటిక్ ఏం ఉంటుందంటూ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. తాప్సీ మాట‌లు రాఘవేంద్ర‌రావును చిన్న‌బుచ్చేలా.. అవ‌మానించేలా ఉన్నాయంటూ ప‌లువురు తాప్సీని  విమ‌ర్శించారు. ఈ వేడి ఆమెకు త‌గిలింది. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

టాలీవుడ్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడైన రాఘవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తాను చిత్ర రంగానికి ప‌రిచ‌యం కావ‌టం త‌న అదృష్ట‌మ‌న్నారు.  శ్రీదేవి.. జ‌య‌ప్ర‌ద లాంటి హీరోయిన్ల‌ను రాఘ‌వేంద్ర‌రావు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశార‌ని.. వంద‌కు పైగా సినిమాలు తీసిన ఆయ‌న చేతుల మీద‌గా త‌న ఎంట్రీ రావ‌టం గొప్ప‌న్నారు. తాను స‌ర‌దాగా చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని.. షోలో త‌న మీద తాను జోకులు వేసుకున్నానే కానీ.. తాను రాఘ‌వేంద్ర‌రావును అవ‌మానించ‌లేద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.  ఒక‌వేళ త‌న వ్యాఖ్య‌లు ఇత‌రుల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఉంటే మ‌న్నించాల‌న్నారు. కామెడీ కోసం మాట్లాడే మాట‌లు హ‌ర్ట్ చేసుకునేలా ఉన్నాయా? లేదా? అన్న‌ది చూసుకోకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది తాప్సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English