మళ్లీ సుకుమార్-ఎన్టీఆర్ కాంబో

మళ్లీ సుకుమార్-ఎన్టీఆర్ కాంబో

నటుడిగా ఎన్టీఆర్ కు ఉన్న పేరు.. దర్శకుడిగా సుకమార్ కు ఉన్న గుర్తింపు ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే విపరీతమైన ఆసక్తి కలిగింది ప్రేక్షకుల్లో. వాళ్ల ఆసక్తికి తగ్గట్లే ఈ కాంబినేషన్లో 'నాన్నకు ప్రేమతో' లాంటి విలక్షణమైన సినిమా వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా వాళ్లిద్దరికీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. 'నాన్నకు ప్రేమతో' తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు.

మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న ఆకాంక్ష ప్రేక్షకుల్లో ఉంది. ఐతే తమ కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రాబోతున్నట్లుగా చెప్పి అభిమానుల్ని సంతోష పెట్టాడు సుకుమార్. తన నిర్మాణంలో తెరకెక్కిన 'దర్శకుడు' ఆడియో వేడుకకు ముందు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన సుకుమార్.. మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.

మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ''త్వరలోనే ఉంటుంది.. మీరు అడిగారని కాదు.. మేమిద్దరం ఇప్పటికే కలిసి ఓ కథ గురించి డిస్కస్ చేశాం. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను'' అని సుక్కు చెప్పాడు. ఏదో అభిమాని అడిగాడు కదా అని మాట వరసకు సుక్కు అలా అన్నాడా.. లేక నిజంగానే ఎన్టీఆర్ తో సుక్కు త్వరలోనే సినిమా చేస్తాడా అన్నది చూడాలి.

'రంగస్థలం' తర్వాత సుక్కు అయితే ఏ కమిట్మెంట్ ఇచ్చినట్లు లేడు. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివలతో సినిమాలు కమిటయ్యాడు. మరి సుక్కు-తారక్ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు