లేక లేక సినిమా తీద్దామనుకుంటే...

లేక లేక సినిమా తీద్దామనుకుంటే...

డ్యాన్స్ డైరెక్టర్లు ఒకప్పుడు ఆ ఒక్క పనికే పరిమితం అయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో వాళ్లు కూడా తమ క్రియేటివిటీ చూపిస్తూ దర్శకులైపోతున్నారు. ప్రభుదేవా.. రాఘవ లారెన్స్.. అమ్మ రాజశేఖర్ దర్శకులుగా అరంగేట్రం చేశారు. విజయాలూ అందుకున్నారు.

ఈ కోవలోనే ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం కూడా దశాబ్దం కిందటే మెగా ఫోన్ పట్టేశాడు. కానీ తమిళంలో అతను అజిత్ హీరోగా తీసిన 'ఏగన్' అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. ఎవరూ అతడికి అవకాశం కూడా ఇవ్వలేదు. మళ్లీ డ్యాన్స్ కంపోజ్ చేసుకుంటూ సాగిపోతున్నాడతను. ఐతే ఈ మధ్య రాజుకు మళ్లీ మెగా ఫోన్ మీద మోజు పుట్టింది. తెలుగులో ఓ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.

'ఏగన్' లాగే ఈసారి కూడా రీమేక్ సినిమా చేయడానికే రెడీ అయ్యాడు రాజు సుందరం. కన్నడలో విజయవంతమైన 'కిరిక్ పార్టీ' సినిమాను నిఖిల్ హీరోగా '14 రీల్స్' బేనర్లో రీమేక్ చేయడానికి ఒప్పందం కుదరింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి స్క్రిప్టు తయారు చేసే బాధ్యత నిఖిల్ మిత్రుడు.. 'కార్తికేయ' ఫేమ్ చందూ మొండేటి తీసుకున్నాడు. స్క్రిప్టు కూడా రెడీ అయింది.

కానీ అంతా ఓకే అనుకున్నాక రాజు సుందరం ఈ చిత్రాన్ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో వివరించాక నిర్మాతలు.. హీరోకు అతడి మీద గురి కుదరలేదట. మాస్ టేస్టున్న రాజు సుందరం ఈ చిత్రాన్ని చెడగొట్టేస్తాడేమో అని భయాలు కలిగాయట. అందుకే మర్యాదపూర్వకంగానే అతడికి టాటా చెప్పేశారట. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకుడి వేట మొదలైంది. చందూ అసిస్టెంట్ ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకుంటే.. రాజు సుందరం ఆశలకు ఇలా బ్రేక్ పడిపోయిందేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు