అప్ప‌ట్లో డ్ర‌గ్స్‌కు బానిస‌య్యా-సీనియ‌ర్ న‌టుడు

అప్ప‌ట్లో డ్ర‌గ్స్‌కు బానిస‌య్యా-సీనియ‌ర్ న‌టుడు

టాలీవుడ్లో డ్ర‌గ్స్ కేసులో చిక్కుకున్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు ఈ కేసుతో అస్స‌లు సంబంధం లేద‌ని.. జీవితంలో డ్ర‌గ్స్ ముఖ‌మే చూడ‌లేద‌ని.. పోలీసులు త‌మ‌కు నోటీసులు ఎందుకిచ్చారో అర్థం కావ‌డం లేద‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఓ సీనియ‌ర్ న‌టుడు తాను ఒక‌ప్పుడు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లుగా అంగీక‌రించ‌డం విశేషం. ఆ న‌టుడు మ‌రెవ‌రో కాదు.. భానుచంద‌ర్. తాను ఒక‌ప్పుడు డ్ర‌గ్స్ వాడి దెబ్బ తిన్నాన‌ని.. త‌ర్వాత ఆ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డి జీవితాన్ని చ‌క్క‌దిద్దుకున్నాన‌ని.. ఇండ‌స్ట్రీకి చెందిన యువ‌త దాని జోలికి వెళ్లి జీవితాల్ని పాడు చేసుకోవ‌ద్ద‌ని భానుచంద‌ర్ హిత‌వు ప‌లికాడు.

"యువ‌త‌.. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తులు మత్తుపదార్థాలకు బానిసగా మారొద్దు. గతంలో నేను డ్రగ్స్‌కు బానిసగా మారి చాలా దెబ్బతిన్నాను. పెళ్లి కాక‌ముందే నేను మత్తుమందులకు బానిసగా మారాను. ఐతే త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్నాను. మత్తు ప్ర‌పంచం నుంచి బయటపడేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఈ విషయంలో మా అన్నయ్య నాకు స్ఫూర్తిగా నిలిచాడు. మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించి.. కెరీర్‌పై దృష్టి పెట్టడంతో సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్ను. సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం చాలామంది డ్ర‌గ్స్ కు బానిస‌ల‌య్యార‌ని తెలిసి బాధేస్తోంది. యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు అవసరమైనవి మన దగ్గరకే వస్తాయి" అని భానుచంద‌ర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు