ర‌జ‌నీపై లోక‌నాయ‌కుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ర‌జ‌నీపై లోక‌నాయ‌కుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే అతి కొద్దిమంది సీని ప్ర‌ముఖుల్లో లోక‌నాయ‌కుడిగా పేరొందిన క‌మ‌ల్ హాస‌న్ ఒక‌రు. గ‌డిచిన కొద్ది కాలంగా ఆయ‌న సామాజిక‌.. రాజ‌కీయ అంశాల‌పై త‌ర‌చూ రియాక్ట్ అవుతున్నారు. గ‌తంలో ఆయ‌న మీద వ‌చ్చే వార్త‌ల‌కు.. ఇప్పుడు వ‌చ్చే వార్త‌ల‌కు సంబంధం లేన‌ట్లుగా ప‌రిస్థితి మారింద‌ని చెప్పాలి. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు క‌మ్ స‌హ‌చ‌రుడైన ర‌జ‌నీకాంత్ మీద ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజ‌కీయాల్లోకి త్వ‌ర‌లో వ‌స్తార‌ని భావిస్తున్న రజ‌నీపై క‌మ‌ల్ విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాసేవంటూ పార్టీల్లోకి చేరి అవినీతికి పాల్ప‌డే వారిని వెంటాడే తీరులో తాను విమ‌ర్శిస్తాన‌ని క‌మ‌ల్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ర‌జ‌నీపైన ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేస్తూనే.. ప‌లు అంశాల‌పై త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించారు.

క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే..

- ప్ర‌జాసేవ అంటూ పార్టీల్లోకి చేరి అవినీతికి పాల్ప‌డే వారిని వెంటాడే తీరులో విమ‌ర్శిస్తా.

- రాజ‌కీయాల్లోకి ఎప్పుడో వ‌చ్చేశా. ఓటేసేట‌ప్పుడు వేలిపై ఎప్పుడు చుక్క పెట్టారో అప్పుడే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం జ‌రిగిపోయింది.

- ఓటేసేట‌ప్పుడు వేలిపై ఎప్పుడైతే చుక్క పెట్టారో అప్పుడే నా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం జ‌రిగిపోయింది.

- ఇటీవ‌ల అభిమానుల‌తో క‌లిసిన సంద‌ర్భంగా రాష్ట్రంలో వ్య‌వ‌స్థ చెడిపోయింద‌ని ర‌జ‌నీ విమ‌ర్శించారు. ప‌దేళ్ల‌ క్రిత‌మే నేనా మాట‌లు చెప్పా.

-  పొరుగు రాష్ట్రాల్లో ప్ర‌భావ‌వంత‌మైన మంత్రులు చూస్తున్నాం. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌మిళ‌నాడులో అలాంటి ప‌రిస్థితి లేదు.

- త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల్లో అవినీతి మ‌యంగా మారిపోయాయి. లంచ‌గొండిత‌నం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు అనేది ఒక వ్య‌క్తికి సంబంధించిన అవినీతి కాదు. ఇది స‌మిష్టిగా పాల్ప‌డి చేసిన అవినీతి

- ఒక‌రు మాత్ర‌మే అవినీతికి పాల్ప‌డి ఉంటే ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఆమె ఫోటోను ఎందుకు ఉంచారు?

- రాజ‌కీయాలు డ‌బ్బు సంపాదించేందుకు కాద‌ని ప్ర‌తిఒక్క‌రు తెలుసుకోవాలి.

- ర‌జ‌నీకాంత్ పార్టీ పెట్టి మంచి చేస్తే ప్ర‌శంసిస్తా. త‌ప్పు చేస్తే ఇత‌ర పార్టీల మాదిరే విమ‌ర్శిస్తా. సీఎం.. ఎంపీ.. ఎమ్మెల్యేల ప‌ద‌వులు అనేవి మంచి జీతంతో ప్ర‌జ‌ల‌కు సేవ చేసే ఉద్యోగాలుగా భావించాలి.

- ఆ త‌ర‌హా భావ‌న‌తోనే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలి

- కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మార్కులు వేయ‌ను. కేవ‌లం ఓటు మాత్ర‌మే వేస్తా.

- ఉచితాలు స్వీక‌రిస్తే నాయ‌కుడు కూడా దొంగ‌లానే ఉంటాడు. సామాజిక సేవ చేస్తున్నాన‌ని ప్ర‌చారం చేసుకోవ‌టానికి నేను రాజ‌కీయ నాయ‌కుడ్ని కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు