నలుగురు కుర్రోళ్లు వెర్సస్ ఒక సీనియర్

నలుగురు కుర్రోళ్లు వెర్సస్ ఒక సీనియర్

ఈ వారాంతంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో రసవత్తర పోరు జరగబోతోంది. ఈ వారం ఆసక్తి రేకెత్తిస్తున్న రెండు మీడియం రేంజి సినిమాలు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఒక సీనియర్ హీరో.. నలుగురు యువ కథానాయకులతో తలపడబోతున్నాడు. ఆ సీనియర్ హీరో జగపతిబాబు కాగా.. ఆ యువ కథానాయకులు నారా రోహిత్- సుధీర్ బాబు- సందీప్ కిషన్- ఆది.

తెలుగులో మల్టీస్టారర్లు మళ్లీ మొదలైనప్పటికీ.. ఒకరిద్దరు హీరోలు మాత్రమే కలిసి నటిస్తున్నారు. కానీ ఒకే సినిమాలో నలుగురు యంగ్ హీరోలుండటం అన్నది అరుదైన విషయం. ఈ అరుదైన కలయికకు శ్రీకారం చుట్టాడు శ్రీరామ్ ఆదిత్య. ఎంతో విలువైన ఓ వింటేజ్ కారు దొంగతనం నేపథ్యంలో అతను తీసిన థ్రిల్లర్ మూవీ 'శమంతకమణి' ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రోమోలతో బాగా ఆకర్షించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక 'లెజెండ్' సినిమాతో విలన్ వేషాల వైపు మళ్లిన జగపతి బాబు చాలా గ్యాప్ తర్వాత హీరోగా నటించిన సినిమా 'పటేల్ సార్'. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. సాయి కొర్రపాటి నిర్మించాడు. ఈ చిత్రం కూడా ప్రోమోలతో బాగానే ఆకర్షించింది. ఒక చిన్న పాపను రక్షించే మిడిలేజ్డ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు జగపతి ఇందులో.

ఈ చిత్రంపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. రెండూ వైవిధ్యమైన సినిమాల్లాగే అనిపిస్తున్నాయి శమంతకమణి.. పటేల్ సార్. మరి ఈ రెంటిలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. వీటితో పాటు శేఖర్ సూరి రూపొందించిన థ్రిల్లర్ మూవీ 'డాక్టర్ చక్రవర్తి' కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. కానీ దానిపై పెద్దగా అంచనాల్లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English