'శాతకర్ణి'కి ఓకే.. ఈ సినిమాకు సూటవుతాడా?

'శాతకర్ణి'కి ఓకే.. ఈ సినిమాకు సూటవుతాడా?

తెలుగు సినిమాల కోసం బాలీవుడ్ సంగీత దర్శకుల్ని తీసుకురావడం అరుదుగా జరుగుతుంటుంది. ఐతే ఇక్కడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందుబాటులో లేనపుడో.. తమ సినిమాలకు మ్యూజిక్ పరంగా భిన్నమైన టచ్ కావాలనుకున్నపుడో మన దర్శకులు బాలీవుడ్ వైపు చూస్తుంటారు. విలక్షణ దర్శకుడు క్రిష్ తన 'కంచె' సినిమా కోసం అలాగే ఆలోచించాడు.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్‌ భట్‌తో ఆ సినిమాకు మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ సినిమాతో చిరంతన్‌కు మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లోనూ అవకాశం దక్కించుకున్నాడు చిరంతన్. ఈ సినిమాకు ముందు దేవిశ్రీ ప్రసాద్‌ను అనుకుని.. తర్వాత చిరంతన్‌కే ఛాన్సిచ్చాడు క్రిష్.

ఐతే చిరంతన్ తన టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు కానీ.. అతడి సంగీతం మన మాస్ సినిమాలకు మాత్రం సూటవ్వదనే అన్నారంతా. కానీ అతను తెలుగులో రాబోయే ఒక మాస్ మసాలా సినిమాకు సంగీతాన్నందించబోతున్నాడన్నది తాజా సమాచారం. 'శాతకర్ణి'కి చిరంతన్ ఇచ్చిన సంగీతం విని ఇంప్రెస్ అయిన నందమూరి బాలకృష్ణ.. తన కొత్త సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

'పైసా వసూల్' తర్వాత బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా అని.. బాలయ్య నుంచి ఆశించే మాస్ మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయని అంటున్నారు. మరి తాను తెలుగులో చేసిన తొలి రెండు సినిమాలో క్లాస్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్.. ఈ తరహా మాస్ మసాలా సినిమాకు ఎలాంటి సంగీతాన్నందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు