కంట్రోల్‌లో పెట్టమంటున్న చరణ్‌

కంట్రోల్‌లో పెట్టమంటున్న చరణ్‌

'రంగస్థలం 1985'లో చరణ్‌ మాస్‌ లుక్‌కి అయితేనేమి, ఆ టైటిల్‌కి అయితేనేమి క్రేజ్‌ విపరీతంగా వచ్చింది. సుకుమార్‌ ఏదో మ్యాజిక్‌ చేయబోతున్నాడనే భావన అందరిలో కలగడంతో బయ్యర్లు కూడా దీనిపై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు టాప్‌ హీరోల కమర్షియల్‌ చిత్రాలకి ఇచ్చినట్టుగా భారీ ఆఫర్లు ఇస్తున్నారు.

అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా ఎలా పే చేస్తుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టమని, ఒక విధంగా తనపై ఇది ప్రయోగాత్మక చిత్రమే కనుక ఆఫర్లు వచ్చినా కానీ భారీ స్థాయిలో అమ్మవద్దని, మినిమం గ్యారెంటీ లేదా అడ్వాన్స్‌ డీలింగ్స్‌ చేయమని చరణ్‌ నిర్మాతలని కోరుతున్నాడట. ఈ తరహా చిత్రాలు అటు ఇటు అయితే భారీ స్థాయిలో నష్టాలొచ్చి అదే మీడియాలో హైలైట్‌ అయిపోతూ వుంటుంది. గతంలో చాలా మంచి చిత్రాలకి మార్కెటింగ్‌ స్ట్రాటజీ సరి లేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. అందుకే చరణ్‌ ఈ చిత్రం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

బాహుబలి తర్వాత మార్కెట్‌ లెక్కలు మారడంతో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నిటికీ భారీ ఆఫర్లు పలుకుతున్నాయి. ఈ చిత్రాన్ని మాత్రం దాని నుంచి వేరు చేయాలని చరణ్‌ భావిస్తున్నాడట.  వచ్చే లాభాలని వదులుకుని రిస్కు తీసుకోమంటే నిర్మాతలు ఎంతవరకు ఒప్పుకుంటారనేది చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు