చిరంజీవి స్ట్రాటజీ అదుర్స్‌!

చిరంజీవి స్ట్రాటజీ అదుర్స్‌!

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గురించి నిర్మాత చరణ్‌ కానీ, హీరో చిరంజీవి కానీ, దర్శకుడు సురేందర్‌ రెడ్డి కానీ ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వడం లేదు. అయితే ఫలానా నటుడు వున్నాడు, ఫలానా హీరోయిన్‌ని తీసుకున్నారు, ఫలానా తేదీన మొదలు పెడుతున్నారంటూ ఏదో ఒకలా ఇది న్యూస్‌లో నలుగుతూనే వుంది.

పాన్‌ ఇండియా రిలీజ్‌ని టార్గెట్‌ చేస్తోన్న మెగాస్టార్‌ అన్ని వైపులా ఫీల్డింగ్‌ గట్టిగా సెట్‌ చేస్తున్నారనేది మాత్రం ఈ వార్తలని బట్టి స్పష్టమవుతోంది. హిందీ వెర్షన్‌కి క్రేజ్‌ తేవడం కోసం ఐశ్వర్యారాయ్‌ని, తమిళ వెర్షన్‌ కోసం నయనతారని కన్సిడర్‌ చేస్తున్నారని సమాచారం. తాజాగా ఉపేంద్ర ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఉపేంద్ర వున్నట్టయితే కర్నాటకని ఫుల్‌గా కవర్‌ చేయవచ్చు. అలాగే మలయాళం నుంచి కూడా ఎవరైనా స్టార్‌ని తీసుకొస్తే కేరళ కూడా కవర్‌ అయిపోతుంది.

బాహుబలి మాదిరిగా క్రేజ్‌ తీసుకురావడమనేది కష్టతరం అయినా కానీ ఈ విధంగా అన్ని భాషలకీ తెలిసిన నటుల్ని పెట్టడం వల్ల అప్పీల్‌ పెరుగుతుంది. బాహుబలి స్థాయి స్పందన వచ్చినా రాకున్నా నోటీస్‌ చేయకుండా మాత్రం వెళ్లిపోదు. ఈ స్ట్రాటజీ ప్రకారం ఎంత మంది నటులు ఇందులో ఫైనల్‌గా వుంటారనేది తెలియదు కానీ అన్నీ కుదిరితే మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్‌ స్ట్రాటజీనే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు