ప‌వన్ మూవీకి అందుకే నో చెప్పింద‌ట‌

ప‌వన్ మూవీకి అందుకే నో చెప్పింద‌ట‌

చేసింది తక్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌దైన గుర్తింపును తెచ్చుకున్న న‌టి నివేదితా థామ‌స్‌. ఈ కేర‌ళ కుట్టిలో హీరోయిన్ కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల కంటే కూడా.. ప‌క్కింటి అమ్మాయికి ఉండే ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాస్తంత పొట్టిగా.. కొద్దిపాటి బొద్దుత‌నంతో ఉండే నివేదిత‌లో ప్ల‌స్ పాయింట్ ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ మాత్ర‌మే.

ఎలాంటి హావ‌భావాల్ని అయినా ఇట్టే ప‌లికించే స‌త్తా ఉన్న ఈ అమ్మ‌డు తాజాగా నిన్ను కోరి చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. తొలిచిత్రం నాని జెంటిల్ మెన్ మూవీలో గుర్తింపు పొందిన ఆమెకు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీలో చేసే ఛాన్స్ వ‌చ్చింది. అయితే.. ఆ ఛాన్స్‌కు నో చెప్పేయ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ప‌వ‌న్ సినిమాలో అవ‌కాశాన్ని ఎందుకు వ‌దులుకున్నారంటూ ఈ బొద్దుగుమ్మ‌ను అడిగిన‌ప్పుడు ఆమె చాలానే విష‌యాల్ని చెప్పింది. ప‌వ‌న్ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌టం ఏ న‌టికైనా అదృష్ట‌మేన‌ని.. నాలాంటి వారికి ఆ అదృష్టం చాలా త‌క్కువ కాలంలోనే ల‌భించింద‌ని హ్యాపీగా ఫీల‌య్యాన‌ని చెప్పింది. కానీ.. అలాంటి రేర్ ఛాన్స్‌ను వ‌దులుకోవ‌టానికి స‌రైన కార‌ణ‌మే ఉంద‌ని చెబుతోంది.

ప‌వ‌న్ మూవీకి నో చెప్ప‌టానికి తాను చాలానే బాధ ప‌డ్డాన‌ని చెప్పిన నివేదితా.. ఎందుకు రిజెక్ట్ చేశాన‌న్న‌ది చెబుతూ.. ఆ చిత్రంలో ప‌వ‌న్ చెల్లెలు పాత్ర‌ను ఆఫ‌ర్ చేశార‌ని.. అందుకే నో చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించింది. హీరోయిన్ గా చేసి చెల్లెలు పాత్ర‌లో చేస్తే మ‌రిన్ని అవ‌కాశాలు మిస్ అవుతాయ‌న్న ఉద్దేశంతోనే తాను రిజెక్ట్ చేశానే త‌ప్పించి మ‌రోకార‌ణం లేద‌ని ఆమె పేర్కొంది.  చూస్తూ.. చూస్తూ.. హీరోయిన్ గా మంచి పేరు వ‌స్తున్న వేళ‌లో ఎంత ప‌వ‌న్ మూవీ అయితే మాత్రం చెల్లెలు పాత్ర‌లో క‌నిపిస్తే.. కెరీర్‌కు క‌ష్ట‌మే క‌దా? ప‌వ‌న్ మూవీకి నో చెప్ప‌టంలో నివేదిత ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు