తాప్సి మంట‌లు.. చౌద‌రికి కోప‌మొచ్చింది

తాప్సి మంట‌లు.. చౌద‌రికి కోప‌మొచ్చింది

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుపై హీరోయిన్ తాప్సి ప‌న్ను చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వివాదం పెద్ద‌ద‌వుతోంది. ఆమె వ్యాఖ్యాల్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.

సీనియ‌ర్ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ సైతం ఈ వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బాలీవుడ్ వాళ్లు హీరోయిన్ల‌ను ఎలా చూపిస్తారో ఉదాహ‌ర‌ణ స‌హితంగా చెబుతూ.. తాప్సి వ్యాఖ్య‌ల్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న‌తో పాటు రాఘ‌వేంద్ర‌రావు శిష్యుల్లో ఒక‌డైన వైవీఎస్ చౌద‌రి సైతం తాప్సి వ్యాఖ్య‌ల్ని తిప్పికొట్టాడు. చాన్నాళ్లుగా లైమ్ లైట్లో లేని చౌద‌రి.. తాప్సి వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ మీడియాలోకి వ‌చ్చాడు.

‘‘మన సంస్కృతిని ఒక‌సారి పరిశీలిస్తే పురాణాల్లో, గుడిపై ఉండే శిల్పాలపైనా బొడ్డును ఆధారంగా చేసుకుని మహిళను ఎంత అందంగా చూపిస్తారో తెలస్తుంది. అది ఒక కళ. అలాగే డైరెక్టర్లు కూడా హీరోయిన్ని అందంగా చూపించాలనుకుంటారు. అందరూ మా గురువు గారు  లేటుగా తీసిన సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ఆయ‌న‌పై ఒక ముద్ర వేసేస్తున్నారు. కానీ ఆయన కూడా కల్పన, జ్యోతి, మధుర స్వప్నం లాంటి అనేక హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలు తీశారన్న విషయాన్ని ఎందుకు మరచిపోతున్నారు? వాస్త‌వానికి దక్షిణాది డైరెక్టర్లు చూపించేదానికన్నా పది రెట్లు ఎక్కువ అసభ్యకరంగా హిందీ డైరెక్టర్లు హీరోయిన్ల‌ను చూపిస్తున్నారు’’ అని చౌద‌రి అభిప్రాయ‌ప‌డ్డాడు.

మ‌రోవైపు ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి కూడా తాప్సి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డింది. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌న తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’లో కొబ్బరి కాయతో నడుం మీద కొట్టడం ఏం రొమాన్సంటూ  తాప్సి. దర్శకేంద్రుడిని తేలిక చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు