అంత ఎక్స్‌పోజింగ్‌ చేసినా లాభం లేదు

అంత ఎక్స్‌పోజింగ్‌ చేసినా లాభం లేదు

కృష్ణవంశీ 'నక్షత్రం' పోస్టర్లు చూసినా, సాంగ్‌ ప్రోమోస్‌ చూసినా హీరోయిన్లు ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారనే సంగతి క్లియర్‌గా తెలుస్తోంది. రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌ పోటీ పడి మరీ అందాల ఆరబోతకి పూనుకున్న ఈ చిత్రంలో బోనస్‌గా శ్రియా శరన్‌ ఒక ఐటెమ్‌ సాంగ్‌ కూడా చేసింది. ఇంతగా ఎక్స్‌పోజింగ్‌ వుంటుందనే సంగతిని దాచకుండా చూపెడుతున్నా కానీ నక్షత్రం బిజినెస్‌ జరగడం లేదు.

సాయి ధరమ్‌ తేజ్‌ ఇందులో అరగంట పాటు వుండే ప్రత్యేక పాత్ర చేసినా కానీ అతని మార్కెట్‌ కూడా దీనికి దోహద పడడం లేదు. థియేట్రికల్‌ ట్రెయిలర్‌ చూసిన తర్వాత నక్షత్రంపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి. కృష్ణవంశీ మార్కు అతి ఇందులో శృతి మించిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే సందీప్‌ కిషన్‌కి హిట్టొచ్చి చాలా కాలమవుతూ వుండడం, మరోవైపు కృష్ణవంశీకి కూడా ఈమధ్య కాలంలో హిట్‌ లేకపోవడం, సాయిధరమ్‌ తేజ్‌ గత చిత్రం కూడా పల్టీ కొట్టి వుండడం నక్షత్రంకి మైనస్‌ అవుతోంది.

హీరోయిన్లిద్దరికీ కూడా సక్సెస్‌లు లేకపోవడంతో ఈ నక్షత్రం కొనడానికి ఒక్క పాజిటివ్‌ ఎలిమెంట్‌ కనిపించడం లేదు. స్కిన్‌ షో విపరీతంగా వుంటుందనే సంగతి తెలియజేస్తే కొందరు ఎట్రాక్ట్‌ అవుతారని అనుకున్నారేమో కానీ ఇప్పుడు అలాంటి ట్రిక్కులకి పడేలా లేరెవరూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు