పవన్‌ 25లో పగిలిపోయే ఎపిసోడ్లు

పవన్‌ 25లో పగిలిపోయే ఎపిసోడ్లు

పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ తీస్తోన్న సినిమాకి ఇంకా పేరు డిసైడ్‌ చేయలేదు. సినిమా అనౌన్స్‌ అవడంతోనే తొంభై శాతం బిజినెస్‌ క్లోజ్‌ అయిపోయిన ఈ చిత్రం ఇప్పటికి రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

విదేశాల్లో మేజర్‌ టాకీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని రాబోతున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో ఫాన్స్‌కి పిచ్చెత్తిపోయేలా ఒక మూడు ఎపిసోడ్లు రెడీ చేసాడట త్రివిక్రమ్‌. 'అత్తారింటికి దారేది' మాదిరిగా ఇది కూడా ఎమోషన్స్‌ మిక్స్‌ అయిన ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ అందులో లేని యాక్షన్‌ పార్ట్‌ ఇందులో వుంటుందని, ఈ ఎపిసోడ్స్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్‌ రావడం తథ్యమని ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్‌ చెబుతున్నారు.

ఈ చిత్రంపై వుండే అంచనాలు ఎలాంటివనేది త్రివిక్రమ్‌కి తెలుసు కనుక తన హీరో ఇమేజ్‌, మార్కెట్‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా ఏ ఎలిమెంట్‌ మిస్‌ అవకుండా షడ్రసోపేత విందులా ఈ చిత్రాన్ని మలుస్తున్నాడని, షూటింగ్‌ డిలే అవుతున్నా కానీ ఎప్పుడు వచ్చినా రికార్డులు పగలగొట్టే సినిమా అవుతుందనే ధీమాతో చిత్ర రూపకర్తలు వున్నారని సమాచారం.

ఈ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే పవన్‌ తన పార్టీ పనులతో బిజీ అవుతాడు కనుక ఎలక్షన్స్‌ టైమ్‌కి ఫాన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపేలా ఈ చిత్రంలో కొన్ని ఎపిసోడ్లు ప్రత్యేకించి రాసారనేది ఇన్‌సైడ్‌ న్యూస్‌. ఇదే నిజమైతే నాన్‌-బాహుబలి రికార్డులతో పాటు కొన్ని బాహుబలి రికార్డులకీ మూడుతుందని అనుకోవచ్చు. ఏమంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు