'నక్షత్రం'లో అది తప్ప ఇంకేం లేదా?

'నక్షత్రం'లో అది తప్ప ఇంకేం లేదా?

'నక్షత్రం' ట్రైలర్ చూస్తే సినిమాపై పెద్దగా అంచనాలు రేకెత్తించేలా ఏమీ కనిపించలేదు. చాలా వరకు కృష్ణవంశీ సినిమాల ఛాయలే కనిపించాయి. కృష్ణవంశీ కొత్తగా ఏమైనా వినోదం పంచుతాడన్న ఆశ ఏ కోశానా కలగలేదు. ఇప్పటి ప్రేక్షకుల టేస్టుకు భిన్నంగా.. 'పాత' వాసనలు కొడుతున్నట్లుగా అనిపించాయి దృశ్యాలు. ఐతే ట్రైలర్లో ప్రేక్షకుల్ని ఆకర్షించిన అంశమూ ఒకటుంది. అదే హీరోయిన్ల గ్లామర్.

ఓవైపు రెజీనా కసాండ్రా.. మరోవైపు ప్రగ్యా జైశ్వాల్ ఒకరిని మించి ఒకరు గ్లామర్ విందు చేశారని ట్రైలర్లో.. ఆ తర్వాత సాంగ్స్ టీజర్లలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ అంటూ వదిలిన వీడియోల్లో కూడా హీరోయిన్ల మీదే ఫోకస్ అంతా నిలిచింది. రెజీనా.. ప్రగ్యా నటించిన రెండు పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోలు చూస్తే.. గ్లామరసాన్ని పండించడానికి కృష్ణవంశీ అండ్ టీం ఎంతగా కష్టపడిందో అర్థమవుతోంది.

కానీ ఈ మేకింగ్ వీడియోలు చూస్తే.. కృష్ణవంశీ స్టయిల్లో రొమాన్స్ పండించడానికి హీరోయిన్ల తిప్పలు కూడా మామూలుగా ఉండవని అర్థమైంది. సెట్లో అంతేసి మంది ఉండగా.. హీరోను గాఢంగా హత్తుకుపోతూ.. చాలా ఇబ్బందికరమైన యాంగిల్స్‌లో కెమెరాలకు పోజులిస్తూ.. కృష్ణవంశీని సంతృప్తిపరచలేక టేకుల మీద టేకులు తీసుకుంటూ హీరోయిన్లు ఎంతగా ఇబ్బంది పడతారో కూడా అందరికీ తెలిసొచ్చింది.

కాకపోతే ఇలాంటి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం హీరోయిన్లకు రుచించకపోవచ్చు. ఇవి రిలీజ్ చేయడం అంత సమంజసం కాకపోవచ్చు. కానీ ఈ సినిమా వైపు జనాల్ని ఆకర్షించడానికి చిత్ర బృందానికి మరో ఆప్షన్ కనిపించినట్లుగా లేదు. అందుకే వాళ్లీ వీడియోలు రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు