'ఫిదా'లో సర్ప్రైజులు చాలా ఉన్నాయ్

'ఫిదా'లో సర్ప్రైజులు చాలా ఉన్నాయ్

శేఖర్ కమ్ముల సినిమాలన్నీ అదో తరహాలో ఉంటాయి. ప్రతి చోటా అతడి ముద్ర ఉంటుంది. నటీనటులు కూడా అతడి శైలికి తగ్గవాళ్లే ఉంటారు. రెగ్యులర్ ఆర్టిస్టులు అతడి సినిమాల్లో కనిపించడం అరుదు. క్యారెక్టర్ రోల్స్‌లో అంతగా పరిచయం లేని వాళ్లను.. కొత్త వాళ్లను పెట్టుకుంటూ ఉంటాడు కమ్ముల. తన ప్రతి సినిమాతోనూ కొందరు కొత్త వాళ్లను పరిచయం చేస్తుంటారు.

'ఫిదా' సినిమాలోనూ ఆయన చాలామంది కొత్తవాళ్లను నటింపజేస్తున్నాడు. అందులో ఒకరు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. 'పెళ్లిచూపులు'తో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ తల్లి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆమెను 'ఫిదా' ఆడియో వేడుకలో అందరికీ పరిచయం చేశాడు కమ్ముల. ఈ సినిమా విడుదలయ్యాక తరుణ్ భాస్కర్‌కు ఆమె తల్లి ద్వారా గుర్తింపు వస్తుందని కమ్ముల అన్నాడు.

అలాగే 'నేను లోకల్' సినిమాలో అరరే ఎక్కడ ఎక్కడ.. పాటతో సూపర్ పాపులారిటీ సంపాదించిన ఎన్నారై సింగర్ మనీషా కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోందట. శరణ్య అనే టీవీ యాంకర్‌కు కూడా ఒక పాత్ర ఇచ్చాడు కమ్ముల. వీళ్లందరితో పాటు ఓ విశిష్ట నటుడు ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడు. ఆయనే సాయిచంద్. 'మా భూమి'.. 'శివ'.. 'అంకురం' లాంటి సినిమాల్లో నటించి ఆ తర్వాత తెరమరుగైన సాయిచంద్‌ను మళ్లీ తెలుగు సినిమాల్లోకి తీసుకొస్తున్నాడు కమ్ముల. ఆయన హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English