టు అల్లు అర్జున్‌ వయా పవన్‌కళ్యాణ్‌!

టు అల్లు అర్జున్‌ వయా పవన్‌కళ్యాణ్‌!

అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లనుంది. ముహూర్తం షాట్‌ చేసి, డిజె ప్రమోషన్లతో బిజీ అయిపోయిన అల్లు అర్జున్‌, ఆ సినిమాని హిట్‌ చేయలేకపోయినా, కనీసం బయ్యర్లు తీవ్రంగా నష్టపోకుండా కాపాడగలిగాడు. డిజె పని అయిపోవడంతో ఇప్పుడిక తదుపరి చిత్రంపై దృష్టి పెడుతున్నాడు.

వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' చిత్రం వచ్చే వేసవికి విడుదలవుతుంది. ఇందులో అల్లు అర్జున్‌ సరసన నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒక ప్లేస్‌ అను ఎమాన్యుయేల్‌కి దక్కిందని తెలిసింది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తోన్న అను ఎమాన్యుయేల్‌ త్వరగానే స్టార్ల దృష్టిలో పడిపోయింది.

నానితో మజ్ను, రాజ్‌ తరుణ్‌తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త చేసిన అను ఎమాన్యుయేల్‌కి అనుకోకుండా త్రివిక్రమ్‌ నుంచి పిలుపు వచ్చింది. పవన్‌తో నటించేసరికి మిగతా స్టార్లు కూడా ఆమెపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

పవన్‌ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ అయినప్పటికీ ఆమె కంటే అను ఎమాన్యుయేల్‌ పైనే ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా ఇద్దరు టాప్‌ హీరోలతో అవకాశాలు కొట్టేసింది కనుక ఇక ఆమె వెనుదిరిగి చూడాల్సిన పని లేదసలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు