రాహుల్ గాంధీకి కొత్త చెల్లెలు

రాహుల్ గాంధీకి కొత్త చెల్లెలు

ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు రాజీవ్ ఈ దేశానికి ప్రధాని మంత్రిగా పనిచేసి ఎల్టీటీఈ బాంబు దాడిలో మరణించగా... చిన్నోడు సంజయ్ ఎమర్జెన్సీ సమయంలో చేసిన ఆగడాలతో, వివాదాలతో చెడ్డపేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రధానిగా పనిచేసిన రాజీవ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీని గుప్పిట పట్టి దేశ రాజకీయాల్లో కీలకంగా ఉండగా... సంజయ్ గాంధీ వివాదాలలో మునిగితేలి ఆ తరువాత విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ కుటుంబం బీజేపీలో చేరింది. సంజయ్ భార్య మేనక ప్రస్తుతం కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వంలో మంత్రి కాగా కుమారుడు వరుణ్ కూడా ఉత్తర ప్రదేశ్ బీజేపీలో ప్రాధాన్యమున్న నేతగానే ఉన్నారు. అయితే... తాజాగా గుర్ గావ్ కు చెందిన ఓ యువతి తాను సంజయ్ గాంధీ కుమార్తెనంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. దానికి ఇందిర కుటుంబం నుంచి ఎవరూ ఖండించకపోవడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్‌ గాంధీ జీవితంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గుర్‌గావ్‌కు చెందిన 48 ఏళ్ల ప్రియాసింగ్‌ పాల్‌ తాను సంజయ్‌గాంధీ కూతురినంటూ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ‘దివంగత ప్రధాని ఇందిరకు నేను రహస్య మనుమరాలిని. సంజయ్‌ గాంధీ మా అమ్మను రహస్యంగా వివాహం చేసుకు న్నారు. నన్ను చిన్నతనంలోనే దత్తత ఇచ్చారు. సంపన్న కుటుంబంలోనే పెరిగాను. నా తండ్రి సంజయ్‌ గాంధీ అని పెద్దయ్యాకే తెలిసింది. అప్పటి నుంచి వాస్తవాల కోసం అన్వేషిస్తున్నాను’ అని ప్రియాసింగ్‌ పాల్‌ చెప్పింది. జనన ధ్రువీకరణ పత్రం, దత్తత ప్రతుల కోసం న్యాయ పోరాటం చేస్తోందామె.

గత కొద్దివారాలుగా ప్రియాసింగ్‌ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఇందిర వార సులు మౌనం వహిస్తున్నారు. ఏ ఒక్కరూ వీటిని ఖండించలేదు. దేశానికి ముగ్గురు ప్రధా నులను అందించిన నెహ్రూ వంశంపై వచ్చిన సంచలన నిందను ఎవరూ ఖండిం చకపోవడం ప్రియాసింగ్‌ వ్యాఖ్యలకు బలాన్నిచ్చినట్లయింది. డీఎన్‌ఏ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థిస్తున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తన్వీర్‌ నిజామ్‌ చెప్తున్నారు.

కాగా ఈ వ్యవహారం ఇందుసర్కార్ అనే సినిమా కారణంగా వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా ఇందిర వంశాన్ని అపఖ్యాతి పాల్జేసేలా ఉందంటూ ప్రియ బయటకొచ్చింది ఈ సందర్భంగా ఆమె తాను సంజయ్ కుమార్తెనని చెప్పుకొచ్చింది. ప్రియ  నిజంగా నే సంయ్ కూతురా.. కాదా..  ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి... దీనికి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు ఎలాంటి తోడ్పాటు అందిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు