ఇక బరిలోకి బన్నీ దిగాల్సిందే!

ఇక బరిలోకి బన్నీ దిగాల్సిందే!

పవన్‌ ఫాన్స్‌తో ఏర్పడ్డ విబేధాలు పెరిగి, ఇప్పుడు మెగా ఫాన్స్‌లో చాలా మంది తనని ద్వేషించే పరిస్థితి వచ్చింది అల్లు అర్జున్‌కి. కాబోయే మెగాస్టార్‌గా ప్రొజెక్ట్‌ చేసే ప్రయత్నంలో భాగంగా చిరంజీవి రికార్డులని కూడా బన్నీ అధిగమించినట్టు చూపించడం ఏమిటని మెగా అభిమానులు నిలదీసారు. వేరే కాంపౌండ్‌కి చెందిన హీరో ఫేక్‌ రికార్డులు చూపిస్తున్నాడని అభిమానులు ఆరోపించవచ్చు కానీ, తమ క్యాంప్‌కే చెందిన వాడిపై నిప్పులు చెరగడం ఇదే ప్రథమం. మెగా అభిమానులకి అల్లు అర్జున్‌ ఎంత కాని వాడు అయిపోయాడనేదానికి ఇది నిదర్శనం.

అల్లు అర్జున్‌కి సొంతంగా అభిమానులు వుండొచ్చు కానీ అతనికి హంగామా చేసేదీ, అతడి సినిమాల స్థాయి పెంచేది ఖచ్చితంగా మెగా అభిమానులే. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ కూడా అంగీకరిస్తాడు. అయితే తెలిసో, తెలియకో ఫాన్స్‌కి రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్లిపోయాయి. ఇప్పుడు తనని ఆపోజిట్‌ క్యాంప్‌ హీరోలా చూస్తున్నారు కనుక, తన సినిమాల వసూళ్ల గురించి నిర్మాతతోనే గొడవ పడుతున్నారు కనుక ఇది ముదిరిపోక ముందే బన్నీ బరిలోకి దిగి ఫాన్స్‌ని ప్రసన్నం చేసుకుంటే మంచిది. తనలో ఆ ఉద్దేశాలు లేకపోవచ్చు కానీ ఫాన్స్‌కి మాత్రం రాంగ్‌గా కన్వే అయింది. అందుకే త్వరగా రంగంలోకి దిగి ఈ వివాదానికి తెర వేసేస్తే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు