కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి

కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి

గత శుక్రవారం శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ‘మామ్’ దేశవ్యాప్తంగా కొంచెం పెద్ద స్థాయిలోనే విడుదలైంది. ఐతే ఈ చిత్రానికి ఆశించిన ఫలితం మాత్రం దక్కేట్లు కనిపించట్లేదు. సినిమా గురించి ఎక్కడ చూసినా ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీదేవి నటన సూపర్ అని.. ఆమె సినిమాను తన భుజాల మీద మోసిందని.. ఆమెకు తిరుగులేదని అంటున్నారు తప్ప.. సినిమా గురించి పాజిటివ్‌గా మాత్రం మాట్లాడట్లేదు. అసలే లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ డల్‌గా ఉన్నాయి. ఇక సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసరికి వీకెండ్ తర్వాత వసూళ్లు మరింతగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఐతే ‘మామ్’ సినిమాను ఎలాగైనా నిలబెట్టాలని శ్రీదేవి కాళ్లకు బలపం కట్టుకుని మీడియా హౌజ్‌ల చుట్టూ తిరుగుతోంది. అగ్రెసివ్‌గా సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఓ టీవీ ఛానెల్లో ఎమోషనల్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘మామ్’ సినిమాలో శ్రీదేవి కూతురిగా పాక్ నటి సాజల్ అలీ నటించింది. ఆ అమ్మాయి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. ఐతే షూటింగ్ సందర్భంగా ఈ అమ్మాయితో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని.. జాన్వి, ఖుషీలతో పాటు ఈ అమ్మాయి తన మూడో కూతురిలాగా అనిపించిందని.. ఆ అమ్మాయిని తాను ఇప్పుడు చాలా మిస్సవుతున్నానని.. ప్రమోషన్లలో సాజల్ తన పక్కన లేకపోవడం లోటే అని చెబుతూ.. తీవ్ర భావోద్వానికి గురై కన్నీళ్లు పెట్టేసుకుంది శ్రీదేవి. ఐతే ప్రమోషన్ కోసం ఓ టీవీ ఛానెల్లో కూర్చుని తన సహ నటి గురించి మరీ ఎంత ఎమోషనల్ అయిపోవడం చూసేవాళ్లకు అతిగా అనిపించింది.

సినిమాను ప్రమోట్ చేయడం కోసం శ్రీదేవి కావాలనే ఇలా ఎమోషనల్ అయిందేమో అంటున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా.. శ్రీదేవి తెరమీదే కాదు.. బయట కూడా మంచి నటే అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English