రఘువరన్ కథను ఇంకా చెప్పాల్సి ఉంది

రఘువరన్ కథను ఇంకా చెప్పాల్సి ఉంది

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులో తొలి విజయాన్నందించి.. అతడికి ఫాలోయింగ్ కూడా పెంచిన సినిమా 'రఘువరన్ బీటెక్'. తమిళంలో 'వీఐపీ' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి కొనసాగింపుగా 'వీఐపీ-2' చేశాడు ధనుష్.

ఈ చిత్రానికి కథ, మాటలు ధనుషే సమకూర్చగా.. అతడి మరదలు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ నెల 28నే 'వీఐపీ-2' రెండు భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే వీఐపీ ఫ్రాంఛైజ్ ఇంతటితో ఆగిపోదని అంటున్నాడు ధనుష్. ఈ కోవలో ఇంకో రెండు సినిమాలు వస్తాయని అతను చెప్పాడు. రఘువరన్ జీవితంలో ఇంకా చాలా మలుపులున్నాయని.. అతడి కథను ఇంకా చెప్పాల్సి ఉందని అతను మీడియాతో వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో 3, 4 భాగాలు కూడా వస్తాయని అతను స్పష్టం చేశాడు.

ఐతే వీఐపీ-2 ట్రైలర్ చూడగానే జనాలకు ఒక రకమైన మొనాటనీ కనిపించింది. ఇందులో కొత్తగా ఏమీ చూపించేట్లు లేదు. అచ్చం 'రఘువరన్ బీటెక్'ను చూస్తున్నట్లే అనిపించింది. మరి ఇంకో రెండు భాగాలంటే జనాలకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఏమో. అసలు ముందు 'వీఐపీ-2' ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. దాన్ని బట్టి తర్వాత సీక్వెల్స్ తీయాలో వద్దో డిసైడ్ చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు