ఒక్క సినిమాతో మూడు సినిమాల జాతకాలు

ఒక్క సినిమాతో మూడు సినిమాల జాతకాలు

గోపిచంద్‌ నటించిన 'ఆరడుగుల బుల్లెట్‌' విడుదల ఆగిపోవడమే కాకుండా అసలు మళ్లీ ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలీకుండా అయిపోయింది. పివిపి లాంటి పెద్ద సంస్థ రంగంలోకి దిగినా కానీ ఈ చిత్రం బయట పడకపోగా, భవిష్యత్తు టోటల్‌గా చీకటిగా మారడం విచిత్రంగా వుంది.

అయితే ఆ చిత్రం గురించి బెంగ పడాల్సిన పని లేకుండా 'గౌతమ్‌ నంద'పై గోపిచంద్‌ నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం టీజర్‌కి వచ్చిన స్పందనతో ఇది తన కెరియర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని గోపిచంద్‌ ఆశిస్తున్నాడు. గౌతమ్‌ నంద బిజినెస్‌ వేగంగా జరగడంతో ఇది విజయవంతం అవుతుందనే ధీమాతో చాలా కాలంగా విడుదల వాయిదా పడుతోన్న 'ఆక్సిజన్‌'ని లైన్లో పెట్టారు.

గౌతమ్‌ నంద రిలీజ్‌ అయిన మూడు వారాలకి ఆక్సిజన్‌ విడుదల చేయాలని చూస్తున్నారు. ఇంతవరకు ఆక్సిజన్‌కి బిజినెస్‌ అయితే జరగలేదు. గౌతమ్‌ నంద ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో ఆక్సిజన్‌కి కూడా బిజినెస్‌ జరిగిపోతుందని ఆశిస్తున్నారు. ఆ వేడిలో వుండగానే ఈ చిత్రాన్ని సేల్‌ చేసేయాలని చూస్తున్నారు. గౌతమ్‌ నంద హిట్‌ అయితే ఆరడుగుల బుల్లెట్‌ కూడా విడుదలవుతుంది. కానీ ఆ చిత్రం ఫలితం ఏమాత్రం అంతంతమాత్రం అనిపించినా తదుపరి రాబోయే ఈ రెండు చిత్రాల భవిష్యత్తుపై పెద్ద క్వశ్చన్‌ మార్క్‌ పడిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు