సడన్‌గా 'సుడి రాజా' అయిపోయాడు

సడన్‌గా 'సుడి రాజా' అయిపోయాడు

'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలతో వరుస సూపర్‌హిట్స్‌ కొట్టిన నితిన్‌ ఇప్పుడు అగ్ర దర్శకుల దృష్టిలో పడ్డాడు. మొదట్లో అతనితో రాజమౌళి, వినాయక్‌లాంటి దర్శకులు సినిమాలు తీసి హీరోగా మంచి రేంజ్‌కి తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత నితిన్‌ వరుస ఫ్లాప్స్‌తో స్టార్‌ డైరెక్టర్స్‌కి దూరమైపోయాడు. ఇప్పుడు నితిన్‌ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో స్టార్‌ డైరెక్టర్లు తమ కథలకి నితిన్‌ని కూడా కన్సిడర్‌ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం నితిన్‌తో త్వరలో సుకుమార్‌ ఓ సినిమా తీస్తాడని తెలిసింది. ప్రస్తుతం మహేష్‌తో సినిమా తీస్తున్న సుకుమార్‌ అది పూర్తయిన తర్వాత ఓ ట్రెండీ లవ్‌స్టోరీ తెరకెక్కిస్తాడట. ఇందులో నితిన్‌ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడని, ఇటీవలే నితిన్‌తో ఈ మాట కూడా చెప్పాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే నితిన్‌ ఖాతాలో మరో క్రేజీ వెంఛర్‌ యాడ్‌ అయిపోయినట్టే. రెండు హిట్స్‌ వచ్చాయని క్యాష్‌ చేసుకోవాలని చూడకుండా నితిన్‌ చాలా కేర్‌ఫుల్‌గా తన కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు