సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌య్య‌కు షాక్‌

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌య్య‌కు షాక్‌

ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ద్యం దుకాణాల‌పై అక్క‌డి మ‌హిళ‌లు క‌దం తొక్కుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మ‌హిళ‌లు మ‌ద్యం దుకాణాల‌పై క‌న్నెర్ర చేస్తున్నారు. ఇళ్ల మ‌ధ్య‌న ఏర్పాటు చేస్తున్న మ‌ద్యం షాపుల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. దుకాణాల‌పై దాడి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఆగ్ర‌హాన్నే అనంత‌పురం జిల్లా హిందూపురంలో అక్క‌డి మ‌హిళ‌లు ప్ర‌ద‌ర్శించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వియ్యంకుడు.. ప్ర‌ముఖ సినీ హీరో బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురంలో జ‌నావాసాల మ‌ధ్య ఏర్పాటు చేసిన మ‌ద్యం దుకాణానికి వ్య‌తిరేకంగా మ‌హిళ‌లు గ‌ళం విప్పుతూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఇంటి స‌మీపంలోని కాల‌నీలోకి వెళ్లే రోడ్డు ప‌క్క‌నే ఏర్పాటు చేశారు. దీనిపై అక్క‌డి మ‌హిళ‌లు మండిప‌డుతూ.. తాము ఇళ్లు విడిచి వెళ్లిపోవాలా? అంటూ బాల‌కృష్ణ పీఏ కృష్ణ‌మూర్తితో పాటు తెలుగుదేశం నేత‌ల్ని ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌ద్యం దుకాణాల ఏర్పాటు విష‌యంలో టీడీపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రికి వ్య‌తిరేకంగా రాస్తారోకో నిర్వ‌హించారు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఇంటిని ముట్ట‌డించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం. ఇంటిని ముట్ట‌డించిన మ‌హిళ‌ల‌తో మాట్లాడిన బాల‌కృష్ణ పీఏ.. వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇవ్వ‌టంతో వారు వెనుదిరిగారు. ఏమైనా.. మ‌ద్యం దుకాణం ఏర్పాటు విష‌యం ఏపీ అధికార‌ప‌క్షంపై మ‌హిళ‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు