నేనా.. బైకా అని సమంత చైతూనడిగితే..

నేనా.. బైకా అని సమంత చైతూనడిగితే..

అక్కినేని నాగచైతన్యకు బైకులంటే మహా పిచ్చి అన్న సంగతి ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. అతడి దగ్గర బైక్ కలెక్షన్ చాలానే ఉంది. అతను బైక్ రేసుల్లో కూడా పోటీ పడుతుంటాడు. ఆ ఇష్టాన్నే తొలి సినిమా 'జోష్'లోనూ చూపించారు. చైతూకు ఉన్న ఈ ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని రానా నిర్వహించే 'నెం.1 యారీ' ప్రోగ్రాంలో అతడిని ఇరుకున పెట్టే ప్రశ్న వేశాడు ఓ అభిమాని.

''మీరు హైదరాబాద్‌లో మంచి బైక్ రేసర్ అని విన్నాను. చాలాసార్లు యూట్యూబ్‌లో కూడా చూశాను. మరి పెళ్లి తర్వాత సమంత ఎప్పుడైనా సీరియస్‌గా నీకు నేను ముఖ్యమా.. బైకులు ముఖ్యమా అని అడిగితే ఏం సమాధానం చెబుతావు'' అంటూ ఆ అభిమాని చైతూను అడిగాడు. దీనికి తల పట్టుకుంటూ ఇదేం ట్విస్టురా బాబూ అంటూ నవ్వేశాడు చైతూ. చైతూతో కలిసి ఈ షోకు హాజరైన సుమంత్ జోక్యం చేసుకుని.. భలే ప్రశ్న అడిగాడు అన్నాడు.

ఇక రానా అందుకుని.. సమంత రేప్పొద్దున బైకులు వద్దు పాడు వద్దు.. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్.. అంటే ఏం చేస్తావ్ అని చైతూను రెట్టించి అడిగాడు. దానికి చైతూ బదులిస్తూ.. ''నువ్వే ఇంపార్టెంట్ అని సామ్‌కు చెబుతాను. కానీ ఇంటి బయటకు వెళ్లిన తర్వాత బైకే ఇంపార్టెంట్ అని బైక్ తీస్తాను'' అంటూ గట్టిగా నవ్వేశాడు. చైతూ ఇలా చెబుతాడని తనకు ముందే తెలుసని సుమంత్ అంటే.. ఓరి దుర్మార్గుడా అంటూ ఆశ్చర్యపోయాడు రానా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు