లేడీ సూపర్‌స్టార్‌కి మళ్లీ పరాభవమే

లేడీ సూపర్‌స్టార్‌కి మళ్లీ పరాభవమే

కెరియర్‌ పరంగా బ్యాడ్‌ ఛాయిసెస్‌ తీసుకుంటోందని శ్రీదేవిపై ఒక కంప్లయింట్‌ వుంది. బాహుబలి చిత్రాన్ని కాదని దాని స్థానంలో తమిళ 'పులి' చిత్రాన్ని ఎంచుకుని ఆమె పెద్ద పొరపాటు చేసింది. బాహుబలి చిత్రానికి భారీ డిమాండ్లు చేసిందనే చెడ్డ పేరుతో పాటు ఆ పులి నిర్మాతలని బాధ పెట్టిందనే ప్రచారం జరిగి ఆమె ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసింది.

ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత మూడేళ్ల పాటు మరో సినిమా ఏదీ చేయకుండా వచ్చిన ఆఫర్లన్నీ రిజెక్ట్‌ చేసిన శ్రీదేవి 'మామ్‌' చేసింది. రేప్‌ విక్టిమ్‌ అయిన కూతురికి న్యాయం చేయడం కోసం ఒక తల్లి ఎంతటి తెగించిందనే కథాంశంతో రూపొందిన ఈచిత్రంలో శ్రీదేవి నటనకి మార్కులు పడుతున్నాయి కానీ సినిమాని మాత్రం క్రిటిక్స్‌ తూర్పారబడుతున్నారు.

ఇంతవరకు ఎన్నో చిత్రాల్లో చూసిన కాన్సెప్ట్‌తోనే సినిమా చేయడంతో శ్రీదేవి అసలు ట్రెండ్‌ ఫాలో అవడం లేదని అంటున్నారు. రీసెంట్‌గా వచ్చిన రవీనా టాండన్‌ చిత్రం కూడా ఇదే కథతో తెరకెక్కింది. అది అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఇప్పుడు శ్రీదేవి చిత్రానికి కూడా పెదవి విరుపులే వస్తున్నాయి.

ఇలాంటి సినిమాలు క్రిటిక్స్‌ని మెప్పిస్తే తప్ప బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేవు. చూస్తుంటే లేడీ సూపర్‌స్టార్‌కి మళ్లీ పరాభవం తప్పేట్టు లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English