పిచ్చెక్కిస్తోన్న నాని రేంజ్‌

పిచ్చెక్కిస్తోన్న నాని రేంజ్‌

చిత్ర చిత్ర ప్రవర్ధమానమవుతోన్న నాని తాజా చిత్రం 'నిన్ను కోరి'తో కూడా తన స్టామినా చాటుకుంటున్నాడు. 'నిన్ను కోరి' చిత్రానికి తొలి రోజు వచ్చిన షేర్స్‌ చూసి అందరూ శభాష్‌ అంటున్నారు. రెండేళ్ల క్రితం వరకు అతని సినిమాలకి ఓపెనింగ్స్‌ వచ్చేవి కావు. హిట్‌ సినిమాలు ఎన్ని వచ్చినా కానీ ప్రతి సినిమాకీ ప్రేక్షకులని రాబట్టడానికి తంటాలు పడేవాడు. అతని సినిమాలు బాగున్నాయనే పేరు వస్తే తప్ప జనాలు కదిలొచ్చేవారు కాదు.

కానీ నేను లోకల్‌ నుంచి పరిస్థితి మారింది. ఆ చిత్రానికి సూపర్‌ ఓపెనింగ్స్‌ వచ్చినప్పటికీ దిల్‌ రాజు ఫ్యాక్టర్‌ వల్లే అనుకున్నారు. అతను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వల్ల వసూళ్లు వచ్చాయని, లేదంటే నాని మార్కెట్‌ ఇంకా స్టేబుల్‌ అవలేదని అన్నారు.

కానీ నిన్నుకోరి లాంటి సాఫ్ట్‌ సినిమాతో నాని మరోసారి తన సత్తా చాటుకుంటున్నాడు. ఈ చిత్రానికి నాని తప్ప మరో క్రౌడ్‌ పుల్లింగ్‌ ఫ్యాక్టర్‌ ఏమీ లేదు కనుక ఇది పూర్తిగా అతని స్టామినానే అని ఒప్పుకుని తీరాలి. ఇంత సాఫ్ట్‌ సినిమాతో మాస్‌ ఏరియాల్లో కూడా నాని ఓపెనింగ్స్‌ తెచ్చాడు.

ఈ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున దాదాపు అయిదు కోట్ల షేర్‌ తెచ్చాడంటే అతని రేంజ్‌ విపరీతంగా పెరిగినట్టే. పేరు మోసిన హీరోలకి కూడా ఈ షేర్‌ రావడం లేదిపుడు. కేవలం తన టాలెంట్‌తో, కథల ఎంపికతో ఈ రేంజ్‌కి వెళ్లిన నానికి హ్యాట్సాఫ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English